పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ విపరీతంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. పదేళ్లపాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఉందంటే అతనికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.


కోట్లాది సంఖ్యలో అభిమానులు పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తూనే ఉంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం పవన్ కళ్యాణ్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలను చేపట్టారు. అయితే పవన్ కళ్యాణ్ విజయం సాధించిన దగ్గర నుంచి ఆయన అభిమానులు హడావిడి కాస్త ఎక్కువగానే చేస్తున్నారని చెప్పవచ్చు.


పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గరనుంచి ఆయన అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బైక్స్ మీద రాసుకుంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో.... అభిమానులను అలా చేయొద్దని వారించారు. ఇలా చేయడం వల్ల తనకు చెడ్డ పేరు వస్తోందని, ఆర్టీవో అధికారులకు చాలా ఇబ్బంది అని, ఇలాంటి పనులు అస్సలు చేయకూడదని అభిమానులను రిక్వెస్ట్ చేశారు.


కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు బైక్స్ మీద ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే స్టిక్కర్ ను తీసివేయడం కూడా జరిగింది.  ఇది ఇలా ఉండగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్యెల్యేగా విజయం సాధించారు. అటు ఏపీలో తెలుగు దేశం కూటమి అధికారం లోకి రావడం జరిగింది. దింతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం పదవి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: