తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ అంతకు ముందు కానీ ఏ సీఎం సాహసించని విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డిపై నెటిజన్లతో పాటు హైదరాబాద్ పౌరులు అంతా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆడు మగాడ్రా బుజ్జి  అన్న పాపులర్ డైలాగ్ ను రేవంత్ కి ట్యాగ్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.


హైదరాబాద్ అంటే పీస్ అండ్ కూల్ సిటీ. అన్ని కాలాల్లోను ఆహ్లాదకరంగా ఉండే నగరం. అలాంటి భాగ్య నగరంలో ఇప్పుడు చినకు పడితే చాలు క్షణాల్లో చిత్తడి అవుతుంది. రోడ్లు అన్నీ నదుల్లా ప్రవహిస్తూ ఉంటాయి. ఏ మాత్రం భారీ వాన కురిసినా చాలు ఆ వరదంతా ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. ఎటు చూసినా ఆక్రమణల వల్లే ఇదంతా జరగుతుంది అని తెలుసు. చెరువులు నాలాలు అన్నీ కబ్జాకు గురయ్యాయి. నీరు పల్లమెరుగు నిజం దెవుడెరుగు అనే సామెత ఇక్కడ ఉత్త మాటే అవుతుంది. వాన పడితే వచ్చిన నీరు ఎటు పోవాలో తెలియక జలఖడ్గంగా మారి జనం ప్రాణాలనే తీస్తోంది.


ఈ నేపథ్యంలో చాలా అక్రమాలు పెద్దలవి ఉన్నాయని తెలిసి ఏ ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోలేకపోయింది. కానీ రేవంత్ రెడ్డి డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ప్రముఖ హీరో అన్నది కూడా చూడకుండా ఎన్ కన్వెన్షన్ నను కూల్చేశారు. దీనికి కారణం కబ్జాలు ఉన్నాయని భావించడమే.


మరోవైపు ఎవరు చేయలేరు అనే పనిని చేసి చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ తాజాగా మరింత మందిని హైడ్రా లిస్ట్ లో పెట్టారు అని అంటున్నారు. అందులో బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిల పేర్లు కూడా ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లే ఉన్నాయని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ చుట్టుపక్కల దురాక్రమణలతో వానొస్తే నరకం చూస్తున్న వారికి ఇవి ఉపశమనం కలిగించనున్నాయి. మరి రేవంత్ వీటిని కొనసాగిస్తోరో.. లేక ఒత్తిళ్లకు తలొగ్గి మధ్యలో ఆపుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: