ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ వంద రోజులు పూర్తిగా అయింది. ఈ 100 రోజులలో ప్రభుత్వం చేసినది ఏమిటంటే కేవలం అప్పులే అన్నట్లుగా ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం అప్పుల కుప్ప అంటూ వైసీపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నది. గతంలో ఏపీ శ్రీలంక మారుతుందని ఎన్నో రకాలుగా ప్రజలను ఆందోళనకు గురిచేసి ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ అప్పులు తెచ్చి చేసింది ఏంటి అంటూ ఆరోపణలు చేస్తోంది.. కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తామని చెప్పారు.. అందుకు తగ్గట్టుగా కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటో కూడా తెలియడం లేదని విమర్శిస్తున్నారు.


జూన్ 12న కూటమి సర్కార్ అధికారంలోకి ఏపీలో రావడం జరిగింది దానికి ఒక రోజు ముందు నుంచే అప్పులు చేయడం మొదలుపెట్టేసిందట. ఇప్పటివరకు ఏపీలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పు సుమారుగా 15 వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయిందనే విధంగా తెలియజేస్తున్నారు. కేవలం ఇది రెండు నెలలకే కూటమి ప్రభుత్వం ఇంత అప్పు చేస్తే రాబోయే రోజుల్లో అప్పులు తలుచుకుంటే ఏపీ ప్రజలు భయపడాల్సిందే అన్నట్లుగా తెలియజేస్తున్నారు. జూన్ 11న నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకువచ్చారని.. మళ్లీ అదే నెలలో 5000 కోట్ల రూపాయల అప్పు తీసుకువచ్చారని.. మళ్లీ అదే నెలలో 16వ తేదీన 2000 కోట్ల రూపాయలు.. మళ్లీ 25వ తేదీన 2000 కోట్ల రూపాయలు తీసుకోవచ్చారట. ఇలా 31 తేదీన 3000 కోట్ల రూపాయలు ఇలా ఒక నెలలోనే సుమారుగా ఇన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చారంటూ వైసీపీ నేతలు వాదన వినిపిస్తున్నారు.


ఇలా అప్పులను కూటమి ప్రభుత్వం కొండల పెంచేస్తుందని పైగా వీటికి కాల పరిమితి కూడా 12 ఏళ్ల నుంచి పాతిక ఏళ్లు దాకా సమయాన్ని పెట్టారని తెలుపుతున్నారు. అంటే సుమారుగా రెండు మూడు తరాల వరకు ఈ అప్పు ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ అప్పులు తెచ్చి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టలేదనే విధంగా విమర్శిస్తున్నారు. అప్పులలో చంద్రబాబును మించిన వారు ఎవరు ఉండరు అనే విధంగా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: