* మంత్రులను ఓడిస్తానని శపథం
* కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతానని ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం నెలకొంది. ఇప్పటికే 6 గ్యారంటీలు అమలు చేయలేక... రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా కష్టాలు పడుతోంది. ఇటు రుణమాఫీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాఫ్ అయిందని రైతులు రోడ్డెక్కారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న... ఆ పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆ పార్టీ టికెట్ ద్వారా గెలిచి... కాంగ్రెస్ నేతలకే వార్నింగ్ ఇస్తున్నారు తీన్మార్ మల్లన్న.
వరంగల్ జిల్లాలో తాజాగా బీసీ నాయకుల సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్తో...ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రెడ్డి నేతలపై విరుచుకుపడ్డారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే తొక్కి పట్టి నార తీస్తానని వార్నింగ్ ఇచ్చారు.
అదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడిస్తానని తీన్మార్ మల్లన్న పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో... తీన్మార్ మల్లన్న ఓడిపోతాడా అని.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలెక్టర్కు ఫోన్ చేశారట. అయితే ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తీన్మార్ మల్లన్న... తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై విరుచుకుపడ్డారు. ఆయన పేరు పలకకుండా పరోక్షంగానే ఆయనను ఓడిస్తానని శపధం చేశారు.
అంతేకాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేశారు తీన్మార్ మల్లన్న.బీసీలకు మంచి బడ్జెట్ పెట్టాలని... లేకపోతే రోడ్డు ఎక్కి ధర్నా చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ లుకలుకలు బయటపడ్డాయి. వాస్తవానికి తీన్మార్ మల్లన్న ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో తెలియదు. తాజాగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఆ నేతలని తిడుతున్నారు.