ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన అన్న క్యాంటీన్ల కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని 15 రోజుల కిందట చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రారంభించింది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడుకు కొత్త చిక్కులు తీసుకువచ్చింది ఈ అన్న క్యాంటీన్ వివాదం. తణుకు అన్న క్యాంటీన్లో... జరుగుతున్న అశుభ్రత గురించి... సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.

 

తణుకు పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్లో... తిన్న ప్లేట్లను... మురికి నీటిలోనే శుభ్రం చేస్తున్నారు. అది కూడా వాష్ బేసిన్లో.. రంగు మారిన మురుగు నీటిలో కడుగుతున్న ప్లేట్ల వీడియో వైరల్ గా మారింది. అయితే వీడియో పెట్టిన వ్యక్తి... అక్కడ జరుగుతున్న అశుభ్రత గురించి స్పష్టంగా చెప్పారు. ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అన్న క్యాంటీన్లలో... ఎక్కడ కూడా శుభ్రత లేదని అతని ఆవేదన స్పష్టంగా అర్థం అయింది.

 

అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా సదరు వ్యక్తి తీవ్రంగా... ఫైర్ అయ్యారు. అయితే దీనిపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా స్పందించడం జరిగింది. తణుకు అన్న క్యాంటీన్లో అశుభ్రత పైన ఆరా తీస్తున్నారు మంత్రి నారాయణ.  అదే సమయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ విషయం ఏమీ తెలియకుండానే... ఫేక్ వీడియో అంటూ జడ్జిమెంట్ ఇచ్చేసాడు.

 

సైకో జగన్... ఏపీ ప్రజలకు తక్కువ ధరలో భోజనం పెడుతుంటే...  ఆయన కడుపు మండుతోందని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వం చాలా... గొప్పగా అన్న క్యాంటీన్లను నిర్వహిస్తోందని చెప్పారు. కానీ... వైసీపీ నేతలు ఫేక్ వీడియోలు పెట్టి అన్నా క్యాంటీన్ల పరువు తీస్తున్నారని మండిపడ్డారు. దీనిపై వెంటనే చర్యలు కూడా తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేయడం జరిగింది. అయితే తాజాగా వైరల్ అవుతున్న తణుకు వీడియో.. ఎంత మేరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: