వైసీపీ బలం ఎక్కడ అంటే గ్రామాల్లోనే. 2019 ఎన్నికల్లో కూడా అర్బన్ సెక్టార్ టీడీపీకే ఎక్కువగా ఓట్లేసింది. ఉన్నత వర్గాలు మధ్య తరగతి ఇలా చాలా మంది ఉండే అర్బన్ లో ఒటు ఎక్కువగా టీడీపీకి వెళ్తుంది. వైసీపీ పుట్టిన దగ్గర నుంచి ఓటు బ్యాంకు రూరల్ లోనే పటిష్ఠంగా ఉంది. ఈ నేపథ్యంల చూసినప్పుడు వైసీపీకి 2024 ఎన్నికల్లోను రూరల్ ఓటర్లు బాగానే ఓట్లేశారు అని అర్థం అవుతుంది.
ఆ ఓట్లు అన్నీ కలవబట్టే వైసీపీకి 40 శాతం ఓటు షేర్ లభించింది. అయితే వైసీపీని దెబ్బతీయాలి అంటే రూరల్ ఓటునే టార్గెట్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే గ్రామ సభలను ఎద్ద ఎత్తున నిర్వహించారు. గ్రామాలను అభివృద్ధి చేసేది కూటమి ప్రభుత్వమే అని చంద్రబాబు నుంచి పవన్ కల్యాణ్ వరకు అందరూ చెప్పారు. గ్రామాలకు తామే ప్రగతి దారులు చూపిస్తామని వారికి దండిగా నిధులు ఇస్తామని చెప్పారు.
ఇక ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా గ్రామ సభలు జరగడం కూడా గొప్ప విషయమే. పైగా ఈ గ్రామ సభల్లో సర్పంచులు అధ్యక్షత వహించారు. అలా సీఎం , డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్న సభల్లో సర్పంచులు హైలెట్ అయ్యారు. ఇక నిధుల విషయంలో నేరుగా ఇస్తామని చెప్పడంతో వారంతా ఖుషీ అవుతున్నారు.
నిజం చెప్పాలంటే నూటికి 90 శాతం మంది వైసీపీ మద్దతుదారులే ఉన్నారు. అయితే వారిని ఉదాశీనంగా చూడటంతో పాటు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా వాటిని మళ్లించడంతో వారంతా క్షేత్రస్థాయిలో ఏమీ చేయలేక మిన్నుకుండిపోయారు. ఈ క్రమంలో పంచాయతీలకు నిధులు కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడంతో వారంతా కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే అక్కడక్కడ టీడీపీ, జనసేన జెండాలు కనిపిస్తున్నాయి. వైసీపీకి అర్బన్ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం లేదు. కానీ రూరల్ లో టీడీపీ ఎత్తుగడలతో వైసీపీ దెబ్బ పడేలా ఉంది. ఈ పరిణామాలు వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి.