దాదాపుగా ప్రాంతీయ పార్టీలలో సీఎం పదవి కోసం పెద్దగా పోటీ ఉండదు. ఎవరో ఒకరు , ఇద్దరు పోటీపడినా కూడా అది అంత తీవ్ర స్థాయిలో ఉండదు. కానీ జాతీయ పార్టీలలో సీఎం సీటు కోసం పెద్ద స్థాయిలో పోటీ ఉంటుంది. సీనియర్లు ఎవరు ఉంటారు వారే సీఎం సీటులో కూర్చోవడానికి అర్హులుగా భావిస్తూ ఉంటారు. కొత్త వాళ్లు వచ్చి సీఎం స్థాయికి వెళ్ళినట్లు అయితే సీఎం పదవిపై అనేక పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో 2023 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని అధికారం లోకి వచ్చింది.

ఇకపోతే రేవంత్ రెడ్డి ఈ పార్టీలో కొన్ని సంవత్సరాల క్రితమే జాయిన్ అయ్యాడు. రేవంత్ ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే ఎంతో కీలకమైన వ్యక్తిగా మారాడు. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికలలో తనదైన స్థాయిలో ప్రాణాలికలను వేయడం వల్ల ఈ పార్టీకి భారీ ఎత్తున సీట్లు వచ్చాయి. దానితో ఈయనను సీఎం చేస్తారు అనే ఊహాగానాలు మొదటి నుండి వచ్చాయి. కాకపోతే పార్టీలో సీనియర్ నేతలు చాలా మంది ఉండడంతో సీఎం సీటు ఎవరిని వరిస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది.  మేము పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాం , పార్టీ అధికారంలో లేకపోయినా ఇతర పార్టీల నుండి ఎన్నో ఒత్తిళ్లు వచ్చిన మేము పార్టీలోనే కొనసాగాం. మాకే సీఎం సీటు కావాలి అని అనుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపించండి. దానితో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా అధిష్టానం మాటలను ఏ మాత్రం పెడచెవిన పెట్టకుండా వారి మాటలను పాటించింది.

ఇకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయిన కూడా కాంగ్రెస్ పార్టీలో సీఎం కావాల్సినంత స్థాయి ఉన్న వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు. ఈయన ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. అలాగే చాలా గొప్ప రాజకీయ నాయకుడు. ఈయన కూడా సీఎం స్థానాన్ని ఆశించాడు. కానీ పార్టీ అధిష్టానం రేవంత్ సీఎం గా ప్రకటించడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వారి మాటలను ఫాలో అయ్యాడు. మరి ఉత్తమ లాంటి గొప్ప లీడర్ అధిష్టానం మాటను ఏ మాత్రం పెడచెవిన పెట్టకుండా అలాగే ఐదు సంవత్సరాలు ఫాలో అవుతాడా లేక రేవంత్ కి ప్రమాదంగా మారుతాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: