తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనతో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పక్కలో బల్లెంలా తయారయ్యారని ఆయన కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాత్ర కీలకం అని సమాచారం అందుతోంది.
 
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సైతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు రెడ్డి నేతలు కుట్రలు చేశారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కోమటిరెడ్డి ఒకరు కాగా ప్రతి వివాదంలో ఆయన పేరు వినిపిస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చేయండి అంటూ కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ సైతం గతంలో సంచలనం అయ్యాయి.
 
ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయాలంటూ అధికారులను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో ఆదేశించడం జరిగింది. వివాదాస్పద విషయాలపై కోమటిరెడ్డి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారనే ఆరోపణలు సైతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డికి వెంకట్ రెడ్డి వల్ల కొత్త సమస్యలు క్రియేట్ చేస్తున్నాయి.
 
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ పాలన బాగానే ఉన్నా రుణమాఫీ అమలు పూర్తిస్థాయిలో జరగలేదనే కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై కౌంటర్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిలవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ప్రస్తుతం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. 2028లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో చూడాలి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతి విషయాన్ని తెగేదాకా లాగడం సరికాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొన్ని విషయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు మారాలని నెటిజన్లు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: