-నిక్కచ్చిగా మాట్లాడే నాయకుడు.
-టిడిపిలోనే ఉంటూ చంద్రబాబుపై విమర్శ.
- ముక్కు సూటి తనం జేసి ప్రభాకర్ రెడ్డి తత్వం.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఇందులో చాలామంది రాజకీయ నాయకులు చంద్రబాబు అంటే భయపడుతూ ఉంటారు. అంతే కాదు చంద్రబాబును అది ఇది అంటూ గాల్లోకి ఎత్తుతారు. ఆయనపై అద్భుతమైనటువంటి స్పీచ్ లిస్తూ మన్ననలు పొందాలని చూస్తారు. కానీ అందులో డిఫరెంట్ రాజకీయ నాయకుడు అంటే జెసి ప్రభాకర్ రెడ్డి అని చెప్పవచ్చు. ఏ విషయాన్నైనా భయపడకుండా నిక్కచ్చిగా చెప్పే మనస్తత్వం కలిగిన నాయకుడు. కేవలం తన గురించే కాకుండా పార్టీలోని అందరి నాయకుల గురించి కూడా డైరెక్ట్ గా మాట్లాడుతాడు. అందుకే జెసి ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా అణచివేయబడుతున్నాడు. రాజకీయం అంటేనే నాలుక నుంచి విషయం చిమ్మడం. అలా విషం చిమ్మే వారికే రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. కానీ జెసి ప్రభాకర్ రెడ్డి మాత్రం తన నోటికి ఏది వస్తే అది డైరెక్ట్ గా మీడియా ముందు అనేస్తూ ఉంటాడు. దీనివల్ల ఆయన చంద్రబాబుకు చాలా తలనొప్పిగా మారిపోయాడు. మన నాయకుడు ప్రతిపక్ష నాయకుడనే తేడా ఉండదు. ఏ నాయకుడైనా సరే డైరెక్ట్ గా ప్రశ్నించడమే ఆయన తత్వం. అలాంటి జెసి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినా కానీ చంద్రబాబుకు ప్రతిసారి ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. మరి ఆయన గురించి కొన్ని వివరాలు చూద్దాం..

 చంద్రబాబుకు తలనొప్పిగా జేసీ ప్రభాకర్ రెడ్డి:
తాడిపత్రి రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ ది ప్రత్యేకమైన శైలి. రాష్ట్ర, నియోజకవర్గ రాజకీయాలను వారికి అనువుగా మలుచుకోవడంలో వీరు దిట్టా అని చెప్పవచ్చు. ఈ విధమైన ఆలోచనతోనే అణువుగాని చోట వీరు అధికులమని చెబుతారు. అలా చెప్పడం వల్లే జెసి సోదరులు బొక్క బోర్లా పడ్డారు.  ఏదో రాజకీయాల్లో గెలిచాం కదా అని డైరెక్టుగా అది నాయకుడికే చెక్ పెడితే ఉన్నది పోతది, ఉంచుకున్నది పోతది అన్నట్టు, ప్రస్తుతం ఆ విధంగానే తయారయింది వీరి పరిస్థితి. అలాంటి జేసీ సోదరుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా దూకుడు మీద ఉండే నాయకుడు. ఈయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. 1987 ఆగస్టు నుంచి 1992 ఆగస్టు వరకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి 2025 వరకు రెండవసారి కూడా మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.  అలాగే 2025 నుంచి 2010 వరకు కూడా మరోసారి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు.


 ఇక రాష్ట్ర విభజన అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ తరుణంలోనే ఆయన 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తాడిపత్రి నుంచి పోటీ చేసి మొదటిసారి గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు.  ఇక అప్పటినుంచి ఆయన చంద్రబాబుకి ఎంతో దగ్గర అయిపోయాడు. ఆ చనువును అలాగే కాపాడుకోకుండా నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా వ్యవహరించాడు. చివరికి చంద్రబాబుకే పక్కలో బల్లెంలా మారాడు. ఇది ఎంతో గమనించినటువంటి చంద్రబాబు నాయుడు ఆయనకు టికెట్ నిరాకరిస్తూ వచ్చాడు.  దీంతో జెసి ప్రభాకర్ రెడ్డి టికెట్ కోసం అనేక ప్రయత్నాలు చేసి చతికిల పడ్డారు. 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు జెసి అస్మిత్ రెడ్డికి ఎమ్మెల్యేగా టికెట్ రావడంతో ఆయన కూడా ఓడిపోయారు.  ఆ తర్వాత జెసి ప్రభాకర్ రెడ్డి 2021లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎంపిక అయ్యాడు. 2024 శాసనసభ ఎన్నికల్లో టికెట్ కోసం ఆశించి బంగపడ్డాడు. ఓడిపోయిన ఆయన మాత్రం చంద్రబాబును ఏదో ఒక రకంగా విమర్శిస్తూ ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: