ఎమ్మెల్యే సోమిరెడ్డిపై  మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి భారీగా అవినీతి కి పాల్పడుతున్నారని బాంబ్‌ పేల్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు చంద్రమోహన్ రెడ్డి 3 లక్షల రూపాయల డిమాండ్ చేశారని బి.జె.పి.నేత పెంచలయ్య ఆరోపించారని గుర్తు చేశారు. తన వద్ద అంత డబ్బులు లేవని చెప్పినా.. సోమిరెడ్డి కనికరించలేదని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గో వర్ధన్ రెడ్డి.


అది మేము చేయించినట్లు ఆరోపించారు.... నగదు.. చేతులు మారాయని అందువల్లే విమర్శలు చేశారని టిడిపి నేతలు అంటున్నారని ఎద్దేవా చేశారు. మాకు ఆయనకు సంబంధం లేదని.. ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి పార్టీ ప్రభుత్వం ఉంది ..మా ఫోన్ల పై నిఘా పెట్టారని ఆగ్రహించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. నేను పెంచలయ్య తో మాట్లా డానేమో చూసుకోండన్నారు.


తాను నిజాయితీపరుడినని సోమిరెడ్డి నిరూపించుకోవాలని... పెంచలయ్య ఆరోపణలపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో  కేసు నమోదు చేశారని తెలిపారు.  ఆయన వీడియోను ఫార్వర్డ్ చేసినందుకు నాపై A2 గా కేసు పెట్టారని... పోలీసు కేసులకు భయపడబోమని తేల్చి చెప్పారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.  సోమిరెడ్డి అవినీతికి పాల్పడినా మాట్లాడకూడదా...సోమిరెడ్డి పై ఇతరులు చేసిన ఆరోపణలను ఫార్వర్డ్ చేయడం తప్పా అని నిలదీశారు.


అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం.. అధికారంలో లేనప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం సోమిరెడ్డి నైజమన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.  గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు.. అంగన్వాడి..ఔట్ సోర్సింగ్..  ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఉద్యోగుల బదిలీలకు కూడా డబ్బులు తీసుకుంటున్నారన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏ.పి. జెన్కో కు చెందిన విద్యుత్ ప్లాంట్  బూడిదకు సంబంధించిన బల్కర్ల నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు కాకాణి.


మరింత సమాచారం తెలుసుకోండి: