- బెజవాడలో మైనస్ అయిన బుద్దా..!
- టిడిపి కోసం టికెట్ త్యాగం.
- చంద్రబాబు పట్టించుకోవడంలేదని తిరుగుబాటు స్వరం


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎప్పుడు మీడియాలో కనిపిస్తూ ప్రతిపక్ష పార్టీలపై తిరుగుబాటు చేసే నాయకుల పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది బుద్ధ వెంకన్న. ఈయన చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉంటూ టిడిపిలో కీలకంగా ఎదిగారు. ఎవరైనా బీసీ నేతను, మంత్రిని తిట్టాలంటే బుద్ధ వెంకన్నను చంద్రబాబు రంగంలోకి దించుతారు. ఆయనతో విమర్శలు చేయించి రాజకీయంగా వాడుకుంటారు.  ఈ విధంగా బుద్ధ వెంకన్నను రాజకీయంగా ఎంతో వాడుకొని చివరికి టికెట్ కూడా ఇవ్వకుండా కూటమిలోని బిజెపికి టికెట్ అందించారు. అలాంటి బుద్ధ వెంకన్న తాజాగా చంద్రబాబు, టిడిపి కూటమిపై తిరుగుబాటు స్వరం చేసినట్టే కనిపిస్తోంది. దీనికి కారణం ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 చంద్రబాబుకు పక్కలో బళ్లెంలా బుద్దా.!


 విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధ వెంకన్న తిరుగులేని లీడర్ గా ఎదిగారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  ఏ బీసీ నేతను  తిట్టాలన్న బుద్ధ వెంకన్న సీన్లోకి ఎంటర్ అయ్యి చంద్రబాబుకు సపోర్టుగా ఉంటూ  వారిపై విమర్శలు చేసేవారు. ఈ విధంగా చంద్రబాబుకు ఎంతో దగ్గర నమ్మిన బంటుగా ఉన్నటువంటి బుద్ధా వెంకన్న టిడిపి బెజవాడ పశ్చిమ టికెట్ తనకి వస్తుందని ఎంతో ఆశపడ్డారు.  చివరికి పొత్తులో భాగంగా ఈ టికెట్ బిజెపి నుంచి పోటీ చేసిన కొత్త అభ్యర్థి సృజనా చౌదరికి  వెళ్లడంతో ఆయనకు బుద్ధ వెంకన్న సపోర్ట్ చేశారు. దీంతో అక్కడ బిజెపి అభ్యర్థి గెలుపొందారు. అయితే అలాంటి బుద్ధ వెంకన్న ప్రస్తుతం టిడిపి అధికారంలోకి వచ్చినా కానీ, తనకు న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నికల్లో టిడిపిపై దాడి చేసిన నేను ఎదురు తిరిగి నిలబడ్డానని, 37 కేసులకు పైగా నా పైన ఉన్నాయని,  నా మాట కనీసం నియోజకవర్గంలో చెల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  నా మాటే చెల్లకుంటే నన్ను నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలని కార్యకర్తలను క్షమించాలని అన్నారు.


 2024 ఎలక్షన్స్ లో రక్తంతో చంద్రబాబు నాయుడు కాళ్లు కడిగానని చివరికి చంద్రబాబును మంత్రిగా గెలిపించుకున్నారని , నాకు టికెట్ రాకపోయినా బాధపడలేదు కానీ  చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్తే అడ్డుకొని నిలబడ్డారని అన్నారు. అలాంటి నాకు ఈ ప్రభుత్వంలో కనీసం గౌరవం లేదని, నాకు  చంద్రబాబు అంటే ఎంతో  గౌరవమని  టిడిపిలో ఎంతోమంది ఎదురు తిరిగి కొట్లాడి టికెట్లు పొందారు కానీ నేను టికెట్ ఇవ్వకపోయినా చంద్రబాబు మాటపై నిలబడి ఉన్నానని గుర్తు చేశారు.  కానీ ఏదైనా పదవి ఉంటేనే మాట చెల్లుతుందని ఈ ఎలక్షన్స్ తర్వాత తెలుసుకున్నానని కనీసం కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో ఉన్నానని చెప్పారు.  2029 ఎన్నికల్లో పోరాటం చేసైనా  టిడిపి టికెట్ సాధిస్తానని ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు. నేను చచ్చే వరకు టిడిపిలోనే ఉంటానని ఆవేదన వ్యక్తం చేశారు.  నా బాధను కేసినేని చిన్ని టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని బుద్దా వెంకన్న మీడియాకు తెలియజేశారు. ఈ విధంగా ఆయన  చంద్రబాబుపై తిరుగుబాటు స్వరం తీసుకువచ్చారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: