రాజకీయాలు అన్న తర్వాత అధికార పార్టీలో ఉన్న నేతలకు ప్రత్యర్ధుల నుంచి ఎప్పుడు ఏదో ముప్పు పొంచి ఉంటూనే  ఉంటుంది. ఏ చిన్న తప్పు చేసిన లేదంటే ఇచ్చిన హామీలను మరచిపోయినా అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రత్యర్థులు అధికార పార్టీ నేతలపై విమర్శలు గుప్పించడం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే ఏకంగా సీఎంగా ఉన్న వ్యక్తికి సైతం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ కి మొదటి నుంచి ప్రతి అడుగులో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టిడిపి నుంచి కాంగ్రెస్లో చేరిన రేవంత్ అతి తక్కువ సమయంలోనే ఇక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు కూడా అందుకున్నారు.


 ఇలా రేవంత్ చేతికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు వచ్చినప్పుడు మొదలైన సీనియర్ నేతల అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొంతమంది నేతలు రేవంత్ సీఎం అయిన తర్వాత ఇక అన్ని మర్చిపోయి కాస్త కలుపుగోలు గానే ఉంటున్నప్పటికీ.. కొంతమంది మాత్రం ఏకంగా రేవంత్ కి పక్కలో బల్లెంలా మారిపోతున్నారు. అలాంటి వారిలో ఇక సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి కూడా ఒకరు అని చెప్పాలి. తనలాంటి సీనియర్ నేతను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్ ఎలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తారు అంటూ గతంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.


 ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచి.. అధికారాన్ని చేపట్టి.. రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా జగ్గారెడ్డి తీరులో మార్పు రావడం లేదు. రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి అనుకూలమే అనిపిస్తున్నట్లుగా ఉంటూనే.. ఎన్నోసార్లు రేవంత్ సీఎం అవ్వడం పై తన అసంతృప్తిని బయట పెడుతున్నాడు జగ్గారెడ్డి. తాను సంగారెడ్డి ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికలు గెలిచి ఉంటే.. తానే సీఎం అయ్యేవాడిని అని గతంలో వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను శాసించే హక్కు ఎవరికీ లేదని.. తనకు ఇష్టం వచ్చినట్లుగానే ఉంటానని అసంతృప్తి గలాన్ని ఎప్పుడు వినిపిస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పటికే సీనియర్ నేతలు అందరూ కూడా తమ తీరు మార్చుకొని రేవంత్ తో కలిసి పనిచేస్తుంటే.. జగ్గారెడ్డి మాత్రం ఇంకా అసంతృప్తితో మాటల తూటలు పేలుస్తూనే ఉన్నారు. ఒకరకంగా సీఎం రేవంత్ పక్కలో బల్లెంలా మారిపోయాడు. ఏదో ఒక రోజు జగ్గారెడ్డి రేవంత్ ను దెబ్బ కొట్టడం ఖాయం అని తెలంగాణ రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఏం జరగబోతుందో చూడలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: