ఆంధ్రప్రదేశ్‌ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల చెంతకే చేర్చడానికి గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.వా లంటీర్ల వ్యవస్థ ఏపీలో మరోసారి చర్చకు వచ్చింది. గత వైసీపీ హయాంలో 2.3 లక్షల మంది వలంటీర్లను నియమించారు. వీరికి నెలకు రూ.5000 చొప్పున గౌరవ వేతనం ఇస్తూ..ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేలా.. వారి సమస్యలకు పరిష్కారం చూపేలా.. జగన్ వ్యవహరించారు. వైసీపీ హయాంలో నియమితులైన వలంటీర్ల ద్వారా.. ప్రజలకు మేలు జరిగిందనేది నిర్వివాదాంశం. ఎక్కడొ ఒకరిద్దరు తప్పులు చేయడం అనేది అన్ని వ్యవస్థల్లోనూ ఉన్నదే.అయితే.. చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగిస్తామన్నారు. రూ.5000 గౌరవ వేతనం స్థానంలో రూ.10 వేలు ఇస్తామని కూడా చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అయితే.. ప్రబుత్వం ఏర్పడి 70 రోజులు దాటిపోయినా… వలంటీర్లను ఎక్కడా వినియోగించుకోవడం లేదు. వారి పేరు, ఊరు కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఈ విషయంపై కొన్నాళ్ల కిందట శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు కూడా తెలియదు అని సమాధానమే చెప్పారు.ఇదిలావుండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోకపోవడంతో వలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు.

కాగా ఎన్నికల ముందు లక్ష మందికి పైగా వలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించారు. ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లను వాడుకోవద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రచారంలో వలంటీర్ల సేవలను వాడుకుని లబ్ధి పొందడానికి వైసీపీ నేతలు వారితో రాజీనామా చేయించారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. అప్పుడు తిరిగి వలంటీర్లుగా తీసుకుంటామని భరోసా ఇచ్చారు.వైసీపీ నేతల మాటలు నమ్మిన వలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వారి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో వలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు మొర పెట్టుకుంటున్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లు, బెదిరింపులతోనే తమ ఉద్యోగాలకు రాజీనామా చేశామని చెబుతున్నారు.అయితే.. తాజాగా మరోసారి వాలంటీర్లు తమ ఆవేదనలను వ్యక్తం చేస్తున్నారు.  మూడు నెలల బకాయిలు ఇవ్వాలని ₹10,000 జీతం హామీని వెంటనే అమలు చేయాలని వాలంటీర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. గత ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన లక్ష మందిని విధుల్లోకి తీసుకోవాలని కోరింది. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలంది. లేదంటే cm చంద్రబాబు, Dy.CM పవన్‌కు తమ ఆవేదన తెలిసేలా ఈ నెల 31 నుంచి వాలంటీర్ల నివేదన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: