కవితా తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈ కేసులో సహ నిందితుడుగా మనిష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఈడి సిబిఐ చారి సీట్లు దాఖలు చేసిన వాటిలో సుమారుగా 57 మంది నిందితులు ఉన్నారట. ఢిల్లీలో సంచలనంగా మారిన మద్యం కేసు మార్చి 16వ తేదీ నుంచి ఈడి అధికారులు చాలా మందినీ అరెస్టు చేయడం జరిగింది. అలా చాలా మందిని తీహారు జైల్లో కూడా ఉంచారు. ఇప్పటివరకు ఈ కేసులో 493 మంది సాక్షులను విచారించినట్లుగా తెలుస్తోంది. మనీష్ తో పాటు బెయిల్ షరతులతో కవితకు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
కవిత సెల్ ఫోన్ లోని డేటా ఉద్దేశపూర్వకంగానే ఫార్మాట్ చేయబడింది అంటూ ఈడి తరపున న్యాయవాది వెల్లడించారు. కవిత అసలు న్యాయ విచారణకు ఈమె స్పందించలేదన్నారు.. మొబైల్ లో ఉండే సందేశాలను తొలగించడం ధర్మమేనా అంటూ ప్రశ్నించింది. ఈడి తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. ఫోన్లో డేటా ఎక్కువగా ఉండటం వల్ల అవి డిలీట్ అవుతాయి ఫార్మేట్ చేయడం లేదని తెలిపారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని కూడా జస్టిస్ గోవాయ్ ఈడిసిబిఐ తరఫున న్యాయవాదుల సైతం ప్రశ్నించడం జరిగింది. కవిత పేరు విచారణ సందర్భంగా చాలా మంది టిఆర్ఎస్ నేతలు కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆమెకు బేయిల్ రావడంతో ఆనందాన్ని తెలియజేస్తారు.