కడప నగర మేయర్ సురేష్ బాబు, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మధ్య వివాదాలు తెరపైకి వస్తున్నాయి. మాధవి రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత వైసీపీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారు. అయితే.. తాజాగా చెత్తపై పన్ను వసూలు చేస్తామని మేయర్‌ చెబితే.. ప్రజలు ఆ పన్ను కట్టకూడదని మాధవి రెడ్డి పేర్కొన్నారు. ఈ తరుణంలోనే... కడప నగర మేయర్ సురేష్ బాబు ఇంటి ముట్టడికి టీడీపీ కార్యకర్తలు, ప్రజలు వెళ్లారు.


టిడిపి శ్రేణులు మేయర్ సురేష్ బాబు ఇంటి వద్దకు చేరుకొని ఇంట్లో చెత్తను విసిరేసి నిరసన తెలిపారు. దీంతో మేయర్ సురేష్ బాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో మొత్తం చెత్త పేరుకుపోయింది. ఈ తరుణంలోనే.. మేయర్ సురేష్ బాబు, వైసీపీ నేతలందరూ.. మాధవిరెడ్డి ఇంట్లో చెత్త వేయడానికి బయలు దేరారు. ఈ నేపథ్యంలోనే.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇరు వర్గాలను కంట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడారు.


వచ్చి మూడు నెలలుకాలేదు, అప్పుడే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందని ఆగ్రహించారు. టిడిపి నేతలు ఇంటి వద్దకు వచ్చి ఇంత అరాచకం చేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.  మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ క్లాప్స్ ప్రోగ్రాం ని ఎత్తివేశారని ఫైర్‌ అయ్యారు. 570 మంది సిబ్బందితో నిత్యం చెత్త ఏరి వేస్తున్నామన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పందికొక్కులు మాత్రమే నా ఇంటి వద్ద చెత్తవేశాయని ఆరోపణలు చేశారు సురేష్ బాబు.

ప్రశాంతంగా ఉన్న కడపను టిడిపి అధికారంలోకి రాగానే  అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నా ఇల్లు పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉందని... పోలీసులకు తెలియకుండా నా ఇంటి వద్ద చెత్త వేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని.. గత మూడు నెలల్లోనే ఎంతమంది చనిపోయారో అందరికీ తెలుసు అన్నారు. ఒక బీహార్, వెస్ట్ బెంగాల్ లాగా ఆంధ్ర రాష్ట్రం ఉందన్నారు. మేము అనుకుంటే మీ ఇల్లు వద్ద కూకటి వేళ్లతో తొలగించగలమని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: