దేశంలో సంచలనం సృష్టించిన కోల్ కతా ఆర్జీకార్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై విచారణ కొనసాగుతూ ఉంది. మొదట రాష్ట్ర పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపారు. తర్వాత కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది.


మూడు రోజుల క్రితం మధ్యంతర నివేదికను సుప్రీం కోర్టుకి సమర్పించింది. మరోవైపు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తో పాటు మరో ఆరుగురికి పాలి గ్రాఫ్ టెస్టుకు అనుమతి ఇవ్వాలని కోర్టుని కోరింది.. కోల్ కతా కోర్టు ఇందుకు అనుమతి ఇవ్వడంతో శనివారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించాలని భావించారు.  అయితే సాంకేతిక కారణాలతో దీనిని చేపట్టలేదు. ఆదివారం పాలిగ్రఫీ టెస్టు నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడు పలు కీలక విషయాలు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.


విచారణలో నిందితుడు చెప్పిన వివరాల మేరకు.. పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం లేఖపై కేంద్రం ఘాటుగానే స్పందించింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు.


 మహిళలు, చిన్నారులపై వేధింపులు అత్యాచారాలకు సంబంధించిన కేసులను విచారించేందుకు పశ్చిమ బెంగాల్ కు కేంద్రం 123 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కేటాయించింది. వీటిలో ఇప్పటికే చాలా వరకు ప్రారంభించలేదు. మమత సర్కారు మహిళల భద్రత విషయంలో వైఫల్యం చెందిందని.. తక్షణమే సమర్థ చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎంగామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా రాష్ట్రంలో 48600 అత్యాచారం, పోక్సో కేసులు పెండింగ్ లో ఉన్నా ఇంకా 11 ఫాస్ట్ ట్రాక్, ప్రత్యేక కోర్టులను ప్రారంభించేందుకు మమత సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: