ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇ ఈసుక విధానం తెచ్చామని చెప్పుకున్నప్పటికీ ఇంకా ఎలాంటి ఇసుక అక్రమ తవ్వకాలు ఉండబోవు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు టిడిపి నేతలు కూడా తెలియజేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా కూడా అక్రమ రవాణా ఇసుక జరగడం లేదంటూ తెలియజేస్తున్నప్పటికీ తాజాగా సొంత పార్టీ నేత ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చారు.. టిడిపి పార్టీ సీనియర్ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ఏపీ సీఎం కి ఝలక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


తన నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని మాట నిజమేనని ఏకంగా తన వర్గానికి చెందిన వారే ఈ పని చేస్తున్నారంటూ జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాజాగా అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేశారు. సుమారుగా 25 మంది టీడీపీ నేతలు ఇసుక తరలిస్తున్నారంటూ తెలియజేశారు. వెంటనే ఈ ఇసుక అక్రమ రవాణా ఆపాలి అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. లేకపోతే తాను కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటానని తన అనుచరులకు కూడా వార్నింగ్ ఇచ్చారు.


తన నియోజకవర్గంలో ఉండేటువంటి 2.50  లక్షల మంది ఓటర్లు ఉన్నారని మీకు మాత్రమే డబ్బులు కావాలా అంటూ జేజి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అయితే మీరంతా తనకు కేవలం ఆప్తులు ఐదేళ్లు తనకోసం చాలా కష్టపడ్డారు దయచేసి ఇసుక అక్రమ రవాణా వంటివి చేయవద్దని కోరారు. గత ప్రభుత్వం లో ఇలాంటి అక్రమ రవాణా పైన పోరాటం చేశానని కానీ ఇప్పుడు కూడా మీరు అదే పని చేస్తే ఎలా అంటూ తెలియజేశారు చేసి ప్రభాకర్ రెడ్డి.


ఆంధ్రప్రదేశ్లో ఇసుక చుట్టు రాజకీయాలు తిరుగుతున్నాయని.. ఇసుక ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం దోచుకుంది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఉచిత ఇసుక విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. కేవలం రవాణా చార్జీలు, తవ్వక చార్జీలు చెల్లించి ఇసుక ఎవరైనా తీసుకోవచ్చు.. కానీ ఇలా అధికారంలోకి వచ్చినప్పుడు 48 టన్నుల ఇసుక స్టాక్ యార్డులో ఉండగా ఎన్నికల ఫలితాలు వచ్చాక సుమారుగా 23 లక్షల టన్నుల ఇసుక కూటమినేతలే అక్రమంగా తరలించారు అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తుంటే బాధగా ఉందంటూ తెలిపారు. మరి ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: