సీనియర్ హీరోయిన్ రోజా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది.కానీ తన పర్ఫామెన్స్ చూపించి మళ్లీ గోల్డెన్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా కలసి నటించిన విషయం తెలిసిందే.సినిమాలలో జోరుగా కొనసాగుతున్న సమయంలోనే రాజకీయ రంగంలోకి అడుగు పెట్టింది. అలా టిడిపి పార్టీలోకి తొలుత వచ్చిన ఈమె ఆ తర్వాత అక్కడ గెలవలేక టిడిపి లోనే ఉండలేక ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకొని బయటకు వచ్చి వైసీపీలో చేరింది. వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టింది. ఇదిలా ఉండగా ఎన్నో అంచనాలు పెట్టుకున్న వైసిపి పార్టీ ఈసారి ఓడిపోయింది. పార్టీ ఓడిపోవడంతో రోజాపై రకరకాల విమర్శలు కూడా వెల్లువెత్తాయి.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా వ్యవహారం కలకలం రేపుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆమె దాదాపుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు.పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా చురుగ్గా ఉండట్లేదు.ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం కేటాయిస్తోన్నారు రోజా. తమిళనాట ఉండే ఆలయాల్లో ఎక్కువగా కనిపిస్తోన్నారామె. తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరుడికి కావడిని సమర్పించారు. అంతకుముందు తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామివారినీ దర్శించారు. ఇదివరకు ఫ్యామిలీ ట్రిప్‌గా ఇంగ్లాండ్ వెళ్లొచ్చారు.

ఇలా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు. ఇది కాస్తా- వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశమౌతోంది. ఆమె ఎక్కువ రోజులు పార్టీలో కొనసాగకపోవచ్చనే అభిప్రాయాలకూ తెర తీసినట్టయింది. దీనిపై రోజుకో చర్చ నడుస్తోంది.జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి, పుంగనూరు శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పెద్దగా పొసగకపోవడం, సొంత పార్టీ నాయకులే తనను ఓడిస్తోన్నారంటూ అధికారంలో ఉన్నప్పుడే పలుమార్లు చెప్పుకోవడం.. వంటి పరిణామాలు ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి వచ్చాయి.అదే సమయంలో- రోజా తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో వైఎస్ఆర్సీపీ పేరును ప్రస్తావించకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తించింది.నటీనటులు ఎవరైనా తమ విడాకుల గురించి హింట్ ఇవ్వాలనుకుంటే… సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం.. కలిసి ఉన్న ఫోటోలను తీసేయడం చేస్తారు. ఇప్పుడు నటి కమ్ రాజకీయనాయకురాలు రోజా కూడా అదే చేస్తున్నారు.
 తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీ, జగన్ అనే పేర్లు, బొమ్మలు లేకుండా తీసేశారు. హఠాత్తుగా ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కానీ.. వైసీపీ వర్గాలు మాత్రం ఏదో ఉందని అనుకుంటున్నాయి.

హెడర్‌లో తన వైసీపీ ఆనవాళ్లు లేవు. బయోలో తాను వైసీపీ నాయకురాలినని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అన్న హోదాలకు పరిమితం అయ్యారు. ఎందుకు ఇలా అన్నది వైసీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. నగరి ఇంచార్జ్గ రోజా ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత కావాలని ఆమె అడిగినట్లుగా చెబుతున్నారు. సాధారణంగా పోటీచేసి ఓడిపోయిన వారంతా అక్కడ ఇంచార్జులుగా ఉంటారు. కానీ రోజా పార్టీ కార్యక్రమాలను నిర్వహించే విషయంలో హైకమాండ్ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.కేవలం రోజా వల్లనే నగరి వైసీపీ భ్రష్టుపట్టిపోయిందని.. ఆమెను వదిలించుకోవడమే మంచిదన్న వ్యూహంతో పార్టీ పనులు ఏమీ చెప్పడం లేదు. దేనికీ సమాచారం ఇవ్వడం లేదు. కనీసం సమావేశాలకు ఆహ్వానం రావడం లేదు. అందుకే కోపంతో ఇలా చేశారన్న వాదన వినిపిస్తోంది.తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామం రోజా కొనసాగడంపై మరోసారి అనుమానాలను లేవనెత్తినట్టయింది. తమిళనాడు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలూ వినిపిస్తోన్నాయి. దళపతి విజయ్ కొత్తగా ప్రకటించిన తమిళగ వెట్రి కజగంలో చేరొచ్చనీ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: