- ( ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) .
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన జగన్.. శాసనసభలో అధికారం పోతే పోయింది.. మండలిలో తనకు ఉన్న బలంతో దున్నేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పి అనుకున్నారు. కానీ.. జగన్ ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్టుగా పరిస్థితులు సెలవేయంగా మారిపోయాయి. కొందరు ఎమ్మెల్సీలు ఎన్నికలకు ముందు పార్టీ మారిపోయారు. మరికొందరు ఎన్నికల తర్వాత పార్టీ మారుతున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. జగన్ పై విమర్శలు వెల్లువ కొనసాగుతున్న.. వైసిపి ఎమ్మెల్సీలు ఎవరు కిక్కురుమనటం లేదు. గత కొద్దిరోజులుగా కూటమినేతలు.. జగన్ ను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.
ఇటీవల అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడుకు వైసిపి నిర్లక్ష్యమే కారణమని కూటమి పెద్దలు ఆరోపిస్తున్నారు. కానీ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ వాటిని ఖండించేందుకు ముందుకు రావడం లేదు. ఇంతమంది ఎమ్మెల్సీలు ఉన్న ఒక్కరు కూడా జగన్‌ను కాపాడటం లేదు. కేవలం ఒకే ఒక ఎమ్మెల్సీ మాత్రం ఆలస్యంగా మీడియా ముందుకు వచ్చారు. ఆమె ఎవరో కాదు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. హోం మంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. శాంతిభద్రతల నిర్వహణలో విఫలమయ్యారంటూ విమర్శించారు.
అసలు జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పై చిన్న విమర్శ చేసిన మందలు మందలుగా మీడియా ముందుకు వచ్చి కౌంటర్లు ఇచ్చేవారు. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఒకరంటే ఒకరు కూడా ముందుకు రాని పరిస్థితి. కేవలం ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాత్రమే ముందుకు వచ్చి కాస్తో కూస్తో జగన్ చెప్పిన మాటలనే మళ్లీ తిప్పితిప్పి చెప్పారు. ఈ పరిస్థితి చూస్తుంటే ఎమ్మెల్సీలు కొద్దిమంది మినహా.. ఎవరు వైసీపీలో కొనసాగేందుకు ఏమాత్రం ఆసక్తిగా లేరని.. అందుకే జగన్ పై, ప్రభుత్వం నుంచి విమర్శలు వస్తున్న కౌంటర్ ఇచ్చినందుకు కూడా ముందుకు రావడంలేదని.. వైసిపి వళ్ళే గుసగుసలాడుకుంటున్నారు.