గత కొద్ది రోజుల నుంచి తాడిపత్రి చుట్టు పరిసరాలలో ఉండేటువంటి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఈ రవాణాను అరికట్టేందుకు జెసి కుటుంబం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గత కొద్దిరోజులుగా జెసి ప్రభాకర్ రెడ్డి కూడా ఈ విషయం పైన మాట్లాడుతూనే ఉన్నారు. తమ నేతలు ఇలా చేస్తున్నారని కూడా తెలిపారు. కొన్ని గంటల క్రితం ఇసుక అక్రమ రవాణా ఆపాలనుటూ ఆస్మిత్ రెడ్డి సిఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేయగా నువ్వు ఎవరో నాకు చెప్పడానికి అంటూ మాట్లాడారట. ఈ విషయం అస్మిత్ రెడ్డిని చాలా బాధ కలిగించింది అంటూ తెలుపుతున్నారు.
ఒక ప్రజాప్రతినిధికి ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా అంటూ లక్ష్మీకాంత్ రెడ్డి ని నిలదీశారు.. ఒక ఎమ్మెల్యేతో సిఐ ఇలా మాట్లాడితే సామాన్య ప్రజలతో ఎలా మాట్లాడతారు అనే విషయం మనమే అర్థం చేసుకోవాలని కూడా తెలియజేశారు. అయితే ఇప్పటికే సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి పైన చాలా ఫిర్యాదులు ఉన్నాయని కూడా తెలిపారు. ఆయన పైన చర్యలు తీసుకోకపోతే తాడిపత్రి ప్రజలకు అన్యాయం జరిగినట్టుగానే ఉంటుంది అంటే అస్మిత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా నియోజకవర్గాలలో ఇసుక ఆక్రమ రవాణా చేస్తున్నారని వాటిని అరికట్టేందుకు పోలీసులు చెప్పిన అసలు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. అక్రమ రవాణ చేస్తున్న టిప్పర్లను పోలీసులకు పట్టిస్తే తమ వాళ్ళని అరెస్టు చేస్తున్నారని కేసులు పెడుతున్నారని హాస్పిటల్ రెడ్డి నిన్నటి రోజు తాడిపత్రిలో పోలీస్ స్టేషన్ నందు ధర్నా చేయడం జరిగింది.