* ఎన్టీఆర్ బహిరంగంగానే తిడుతున్న టిడిపి నేతలు
* వైసిపి జెండా కలర్ డ్రెస్ లో ఓటేసిన ఎన్టీఆర్
* చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ సైలెంట్
* టిడిపి కోసం ఎక్కడ పనిచేయని ఎన్టీఆర్



సినిమా హీరోలకు అటు రాజకీయాలకు.. బాగా దగ్గర సంబంధం ఉంటుంది. సినిమాల్లో హీరోలుగా చేసి... రాజకీయాలను ఏలుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా...  అటువైపు తొంగి చూడటం లేదు కొంతమంది హీరోలు. అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.


అలాంటి తెలుగుదేశం పార్టీ కోసం గతంలో పనిచేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు కుటుంబం  వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం మధ్య గొడవలు, బాలయ్యతో విభేదాలు  తదితర కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ టిడిపి వైపు చూడటం లేదు. అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్లి కెరీర్ పాడు చేసుకోవడం ఎందుకని.. ఎన్టీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు.


అయితే చాలామంది తెలుగుదేశం నేతలు అలాగే అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తరచూ డిమాండ్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడిన కచ్చితంగా సీఎం అంటూ ఆయన అభిమానులు సందడి చేస్తూ ఉంటారు. అయితే టిడిపిలో కొంతమంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టిడిపికి అసలు సిసలైన వారసుడు నారా లోకేష్ అంటూ.. బుద్ధ వెంకన్న లాంటి నేతలు స్పష్టం చేశారు.


టిడిపి కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని జూనియర్ ఎన్టీఆర్కు అసలు టిడిపిలో అవకాశమే.. లేదంటున్నారు కొంతమంది నేతలు.  అలాగే చంద్రబాబు అరెస్టు సమయంలో ఎన్టీఆర్ స్పందించలేదని కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఎన్టీఆర్ అస్సలు టిడిపిని పట్టించుకోవడం లేదు. ఇలా మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య... ఎన్టీఆర్ మధ్య దూరం పెరుగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: