జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి కూటమిలో భాగంగా భాగస్వామి అయ్యారు. ఇప్పటికే వందరోజుల పాలన పూర్తి అయ్యింది. డిప్యూటీ సీఎం హోదాలో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా కొత్తగా ఆలోచిస్తారని ఆయన అనుకున్న పని చేస్తారని ఆవైపుగానే అడుగులు వేస్తారని జనసేన నేతలలో కార్యకర్తలలో పేరు ఉన్నది. ఇప్పుడు అలాంటి పవన్ కళ్యాణ్ టిడిపి కూటమిలో ఉన్నారు కానీ ఎక్కడ కూడా పవన్ బ్రాండ్ అనేది కనిపించడం లేదట. అందుకు కారణం పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లాలని చూస్తూ ఉన్న ఆయనని వెనక్కి లాగేస్తున్నారని చర్చ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.




వాస్తవానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖ ఒక పవర్ఫుల్ శాఖ. హోంశాఖ ని కాదని పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ని తీసుకోవడం జరిగింది. ఇటీవలే గ్రామ సభలలో కూడా ఆయన కావాలని ఈ శాఖను తీసుకున్నానని క్షేత్రస్థాయిలో సర్పంచ్లతో నేరుగా కనెక్టివ్ ఉండేలా ఈ శాఖ తీసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతోనే అనుసంధానం అవ్వడం వల్ల ఈ శాఖను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నేరుగా సర్పంచ్లతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లులు అయ్యేలా చూసుకునేలా పవన్ కళ్యాణ్ చేస్తున్నప్పటికీ చాలామంది ఆయనని వెనుకకు లాగేస్తున్నారట. పంచాయతీరాజ్ బిల్లులు కూడా ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకోకూడదని విధంగా తెలిపారు.


సర్పంచులకు బిల్స్ క్లియర్ చేయిస్తే కచ్చితంగా జనసేన పార్టీకి బలం పెరగడమే కాకుండా పలుకుబడి వస్తుందని కూటమిలోని కొంతమంది టిడిపి పెద్దలు జనసేన రూరల్ లో పేరు సంపాదించడం ఇష్టం లేదని.. గ్రామాలలో పట్టువస్తే ఇబ్బందికరంగా మారుతుందని భావించి ఇలా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలోని చిన్న పార్టీగా ఇది సాగాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ను అనుకున్నటువంటి వాటిని చేయకూడదని విధంగా పలు రకాల పనులు చేస్తున్నారట కూటమి పెద్దలు. పంచాయతీరాజ్ శాఖ కింద 13 వేలకు పైగా గ్రామపంచాయతీలో ఒకేరోజు సభలను నిర్వహించి సర్పంచులకు అధ్యక్షత హోదా ఇవ్వడం వంటివి చేశారు పవన్.. దీనివల్ల గ్రామస్థాయిలో పవన్ కళ్యాణ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పేరు పెరగడం వెనుక కూటమిలో అసంతృప్తి కొనసాగుతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: