దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్, కల్వకుంట్ల కవిత, సిసోడియా లాంటి కీలక నేతలు ఇరుక్కున్నారు. అయితే మంగళవారం సాయంత్రం కల్వకుంట్ల కవిత.. జైలు నుంచి కూడా రిలీజ్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో... కల్వకుంట్ల కవిత పేరు పెట్టి... ఎంపీ మాగుంట శ్రీనివాసులు పేరు నిందితుడిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

 

ఒక కేసులో... ఒకరిని నిందితురాలిగా..  మరొకరిని సాక్షిగా ఎలా చేర్చుతారని కూడా ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కల్వకుంట్ల కవిత.. బెయిల్ అంశంపై మంగళవారం రోజున ఆ సుప్రీంకోర్టు విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.  ఢిల్లీ లిక్కర్ స్కాం లో కీలకంగా ఉన్న ఎంపీ మాగుంట పేరు ఎందుకు చేర్చలేదని... ప్రశ్నించింది.

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కార్యకలాపాలకు మొత్తం... ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఇంట్లో జరిగినట్లు కేసులో ఈడి అధికారులు పేర్కొన్నారు. మరి అలాంటి సమయంలో ఎంపీ మాగుంట పేరు ఎందుకు తొలగించినట్లు.. వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అంటే మీకు ఇష్టం ఉంటే పేరు తీసేస్తారు...  నచ్చని వారి పేరు నిందితుల లిస్టులో పెడతారా అని ఆగ్రహించింది.

 

దీనిపైన కచ్చితంగా ఈడి అధికారులు.. సమాధానం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొందట. ఈ కేసులో కీలకంగా ఉన్న మాగుంట శ్రీనివాస్ లును సాక్షిగా ఎలా మారుస్తారని...సుప్రీంకోర్టు ఫైర్ అయింది. ఇది ఇలా ఉండగా బెయిల్ వచ్చిన కల్వకుంట్ల కవిత మంగళవారం రిలీజ్ అయ్యారు. ఇక బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు కూడా చేరుకోబోతున్నారు కల్వకుంట్ల కవిత.

మరింత సమాచారం తెలుసుకోండి: