తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు మరో కొత్త సమస్య వచ్చింది. తన కూతురు కల్వకుంట్ల కవిత తాజాగా బెయిల్ పైన జైలు నుంచి రిలీజ్ కావడంతో... కెసిఆర్ కు ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. బెయిల్ పైన కల్వకుంట్ల కవిత బయటకు రావడంతో ఒక వైపు కాంగ్రెస్... మరోవైపు భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

 


కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం వెనక బిజెపి హస్తము ఉందని బాంబు పేల్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు. భారతీయ జనతా పార్టీ మరియు గులాబీ పార్టీలు రెండు విలీనం కాబోతున్నాయని.. అందుకే కల్వకుంట్ల కవిత  కు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ తెలంగాణ నేతలు చెబుతున్నారు.  కవితకు బెయిల్ రావడంతో   బిజెపి పార్టీలో గులాబీ పార్టీ విలీన ప్రక్రియ మొదలైందని కూడా మహేష్ గౌడ్ లాంటి నేతలు స్పష్టం చేశారు.

 

అదే సమయంలో తెలంగాణ బిజెపి ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చేలా... కల్వకుంట్ల కవిత బెయిల్ పై  విమర్శలు చేశారు. కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం కాంగ్రెస్ నేతలు పని చేశారని కూడా ఆయన బాంబు పేల్చారు. కాంగ్రెస్కు పార్టీకి చెందిన  లాయర్ వాదించడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని కూడా స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్. త్వరలోనే గులాబీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

 

దీంతో కల్వకుంట్ల కవిత బయటికి వచ్చిన సంతోషం కలవకుండా చంద్రశేఖర్ కు లేకుండా పోయిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి.. ఏ పార్టీలకు సంబంధం లేకుండా కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిందన్న సంగతి తెలిసిందే. కవితకు బెయిల్ ఇచ్చింది ఏ పార్టీ ఓ కాదు... సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాంటి అంశంపై బీజేపీ అలాగే కాంగ్రెస్ నేతలు విభిన్నంగా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టును అవమానించేలా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr