ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మీమర్స్, ట్రోలర్స్ నాగార్జునను టార్గెట్ చేసిన స్థాయిలో మరెవరినీ టార్గెట్ చేయలేదనే సంగతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ వివాదం విషయంలో నాగార్జున పేరు న్యూస్ ఛానెళ్లలో, పేపర్లలో మారుమ్రోగింది. నాగార్జున నిజంగా చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారో లేదో తెలీదు కానీ మెజారిటీ ప్రజలు మాత్రం ఆ ఆరోపణలే నిజమని నమ్ముతుండటం కొసమెరుపు.
 
నాగార్జున పూర్తిస్థాయిలో ఆధారాలను మీడియా ముందుకు వచ్చి చూపించి ఉంటే మాత్రం ఈ పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదని కచ్చితంగా చెప్పవచ్చు. మరోవైపు పార్టీ ఫండ్ ఇవ్వలేదనే కారణంతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారని ఒక వర్గం మీడియా వార్తలను ప్రసారం చేస్తోంది. హైడ్రా నాగార్జునను టార్గెట్ చేయడం వెనుక అసలు కారణాలు తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.
 
నాగార్జున ఈ కేసులో కోర్టును ఆశ్రయించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో పాటు ఆర్థికంగా నాగార్జునకు గట్టి దెబ్బ పడిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. వాస్తవానికి నాగార్జున గతంలో ఎప్పుడూ ఈ తరహా వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సందర్బాలు అయితే లేవనే చెప్పాలి. నాగార్జున పారితోషికం సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.
 
నాగార్జునకు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉండగా ఒక్కో మెట్టు ఎదిగి నాగార్జున ప్రశంసలు అందుకున్నారు. ప్రతి హీరో కెరీర్ లో చిన్నచిన్న వివాదాలు సాధారణం అనే సంగతి తెలిసిందే. అయితే ఆ వివాదాలను అధిగమిస్తే మాత్రమే నాగార్జున కెరీర్ మరింత పుంజుకునే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.  స్టార్ హీరో నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమాతో పాటు బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్నారు. నాగ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: