* ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వైసీపీ లీడర్ రోజా
 
* ప్రత్యర్థి నేతలపై నోరు పారేసుకుంటున్నారు  

* వందల వివాదాల్లో చిక్కుకున్నారు

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు రోజా. సినిమాల్లో సొంత కృషి, పట్టుదలతోనే పాపులర్ అయ్యారు. అదే పాపులారిటీతో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగానూ పనిచేశారు. ఆపై వైసీపీలో చేరి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. ఫైర్‌బ్రాండ్‌గా మారి ప్రత్యర్ధులపై బాగా నోరు పారేసుకోవడం అలవాటు చేసుకున్నారు. మంత్రి హోదాలో ఉండి మాట్లాడరాని మాటలు మాట్లాడుతున్నారని ఆమెను చాలా మంది విమర్శించారు.

అంతేకాదు మిగతా విషయాల్లోనూ ఆమె చేసిన కొన్ని పనులు చాలా మందిని ఆగ్రహానికి గురి చేశాయి. ఇటీవల తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రమణ్యస్వామి ఆలయానికి ఆమె వెళ్లారు. ఇది తెలిసిన పారిశుద్ధ్య కార్మికులు రోజాతో సెల్ఫీలు దిగాలని కోరుకున్నారు. అయితే రోజా వారిని దూరంగా ఉండండి, అక్కడి నుంచే సెల్ఫీలు ఇస్తాను అని చేతితో సైగలు చేశారు. పాపం ఆ పారిశుద్ధ్య కార్మికులు దూరంగా ఉండే రోజాతో సెల్ఫీలు తీసుకున్నారు. తర్వాత ఫొటో చూసుకుని ఎంతో మురిసిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ విజువల్స్ వైరల్ కావడంతో ప్రజలు రోజాను దారుణంగా విమర్శించారు.

ఇదిలా ఉంటే వేరే మతానికి చెందిన పర్సనల్ ఫొటోగ్రాఫర్ స్టెయిన్‌ తిరుమలకు తీసుకొచ్చి వివాదంలో చిక్కుకున్నారు. రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాల్లో పర్యటించారే తప్ప రాష్ట్రంలో ఏ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఒకానొక సమయంలో ఈమె ఉద్యోగితో చెప్పులు మోయించి అందరి చేత తిట్టించుకున్నారు. తాను ఒక ఆడదాన్నే అని మరిచి మహిళలపై నోటికొచ్చినట్లు రోజా మాట్లాడతారని కూడా ఒక మచ్చ ఉంది. అసెంబ్లీలో రోజా వెకిలి చేష్టలు, వికృత చేష్టలతో రెచ్చిపోయిన దృశ్యాలు వైరల్ కూడా అయ్యాయి. పీతల సుజాతను బాడీ షేమింగ్‌ చేసినట్లు తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. దుర్భాషణలు, దుర్మార్గపు వ్యాఖ్యలకు ఆమె కేరాఫ్ అడ్రస్ అంటూ వంగలపూడి అనిత రోజాను ఏకిపారేసిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ పథకాల్లో కూడా ఆమె రూ. 100 కోట్లు స్కామ్‌ చేసినట్లు అలిగేషన్స్ వచ్చాయి. ఇలా ఒకటి కాదు ఆమెపై వందల సంఖ్యలో వివాదాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: