ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజశేఖర్ చిరంజీవిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఒకప్పుడు చిరంజీవి, రాజశేఖర్ మంచి స్నేహితులు కాగా ఎవరైనా సరే గొప్ప అని ఫోజు కొడితే నాకు అస్సలు నచ్చదని అందుకనే చిరంజీవిపై కోపమని రాజశేఖర్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. విచిత్రం ఏంటంటే అల్లు అరవింద్ కుటుంబంతో జీవిత కుటుంబానికి దూరపు చుట్టరికం ఉంది.
చిరంజీవి ప్రవర్తన నచ్చక ఆయనతో విబేధించామని రాజశేఖర్ ఒక సందర్భంలో వెల్లడించారు. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ జీవిత రాజశేఖర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. రాజశేఖర్ పై నెగిటివిటీ పెరిగేలా కొన్ని దుష్ప్రచారాలు జరగడం మెగా ఫ్యామిలీనే ఆ దుష్ప్రచారాలు చేసిందని రాజశేఖర్ భావించడం వల్ల కూడా గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది.
అయితే ఇండస్ట్రీ అంటే చిన్నచిన్న సమస్యలు సాధారణం అని అందరు హీరోలు కలిసి ఉంటే మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇతర ఇండస్ట్రీలకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ మధ్య వివాదం కూడా పరిష్కారమైతే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. చిరంజీవి ఆరు పదుల వయస్సులో సైతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.