- నాగుపాము కున్నంత కోపం నాగబాబు సొంతం..
- ప్రతి విషయంపై స్పందిస్తూ మెగా పరువు తీసేస్తూ.?
- మెగా ఆవేశం స్టార్ గా గుర్తింపు.!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు.ఇంత గౌరవం రావడానికి ప్రధాన కారకుడు చిరంజీవి. అలాంటి మెగా బ్రదర్స్ లో చిరంజీవి,పవన్ కళ్యాణ్ రాజకీయంగా సినిమా పరంగా చాలా ఎదిగారు. కానీ నాగబాబు మాత్రం అంతగా ఎదగలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఆయన తొందరపాటు నిర్ణయాలు, ఎక్కువ కోపం ప్రదర్శించడం. ఆయన ఏ విషయంలో అయినా తొందరపాటు నిర్ణయం తీసుకుంటూ చిన్న విషయానికైనా ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు..అందుకే నాగబాబును ఆవేశం స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏదైనా చిన్న విషయం ఉన్నా కానీ దాన్ని హైలెట్ చేసి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం నాగబాబు సొంతం. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అనే సామెతకు నిలువెత్తు నిదర్శనం నాగబాబు అని చెప్పవచ్చు. ఆయనకు ఉన్నటువంటి నోటి దురుసు ఫ్యామిలీని చాలా వరకు విమర్శలు పాలు చేసింది. ఎవరైనా చేసిన చిన్న చిన్న తప్పులకు కూడా వాళ్లపై ఘాటు విమర్శలు చేసి కాంట్రవర్సీని క్రియేట్ చేయడంలో దిట్ట అని చెప్పవచ్చు. ఆయన ఇప్పటివరకు చేసిన కాంట్రవర్సీలో కొన్ని కాంట్రవర్సీలు తీవ్రంగా మెగా ఫ్యామిలీని విమర్శలకు దారితీసాయి. మరి ఆయన కాంట్రవర్సీలో చాలా వైరల్ అయిన కాంట్రవర్సీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
 
ఆవేశం స్టార్ నాగబాబు:
 నాగబాబు ఏదైనా సినిమా ఈవెంట్లలో కానీ, రాజకీయ పార్టీల స్పీచుల్లో కానీ సోషల్ మీడియా అకౌంట్లో కానీ ఎప్పుడూ ఏదో రకంగా స్పందిస్తూ కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంటాడు. రీసెంట్ గా ఏపీ రాష్ట్రంలో ఎలక్షన్స్ టైం లో అల్లు అర్జున్ చేసిన ప్రచారంపై కూడా స్పందిస్తూ దారుణంగా ట్విట్టర్ వేదికగా విమర్శించాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత నాగబాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. " మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే" మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే " అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇది కాస్త వివాదాస్పదమైంది. అల్లు ఫ్యామిలీకి చెందినటువంటి అల్లు అర్జున్ తన మిత్రుడైనటువంటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి  మద్దతుగా ప్రచారం చేశాడు.అయితే నాగబాబు దీన్ని ఉద్దేశించే అల్లు అర్జున్ కు కౌంటర్ ఇచ్చారని బన్నీ అభిమానులంతా నాగబాబుపై విరుచుకుపడ్డారు.  దీంతో నాగబాబు తన ఎక్స్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేశారు.


ఇక మరో వివాదం విషయానికి వస్తే.. తన కుమారుడు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన కామెంట్స్ దుమారం  రేపాయి. ఆరు అడుగులు ఉన్న తన కొడుకును ప్రశంసించే క్రమంలో  అయిదు అడుగులు ఉన్న హీరోలు కూడా పోలీస్ పాత్రలు చేస్తున్నారంటూ వెటకారంగా మాట్లాడాడు. ఐదు అడుగుల మూడు అంగుళాలు ఉన్నవాడు కూడా నేను ఫిట్,పోలీస్ ఆఫీసర్ ని అంటూ చెప్పుకోవడం నాకు చాలా కామెడీగా ఉందంటూ చెప్పుకొచ్చారు. అది చూస్తే నువ్వు పోలీస్ కాలేవురా బాబు అని నాకు అనిపిస్తుంది.వారిని చూస్తే నాకు నవ్వొస్తుంది అంటూ ఆయన మాట్లాడడంతో అది కాస్త రచ్చకు దారితీసింది. అయితే దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. బాద్ షా,  టెంపర్ సినిమాల్లో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. దీన్నిబట్టి నాగబాబు అలా అన్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు.  అంతేకాకుండా అప్పట్లో దున్నపోతు, కుక్క ఫోటోలు పెట్టి వీటి బ్లడ్,బ్రీడ్ చాలా స్పెషల్ అంటూ  పరోక్షంగా బాలకృష్ణ పై కూడా విమర్శలు చేశారంటూ బాలకృష్ణ అభిమానులు అప్పట్లో దుమారం సృష్టించారు.  ఈ విధంగా నాగబాబు చాలా సమయాల్లో కాంట్రవర్సీలు చేస్తూ మెగా ఫ్యామిలీ పరువు రోడ్డున పడేసారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: