- కాంట్రవర్సీల్లో ఘనుడు బాలయ్య బాబు..

- భయపెట్టిన కాల్పులు..

- అక్కినేని తొక్కినేని అంటూ ఘాటు వ్యాఖ్యలు..

 బాలకృష్ణ..ఈయన పేరు చెప్తే 100 సుమోలు గాల్లో లేస్తాయి. ఒంటి చేత్తో వచ్చే ట్రైన్ ను కూడా ఆపగల శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట సింహంగా పేరు తెచ్చుకున్నారు.  బాలకృష్ణ కేవలం సినిమాల్లోనే కాకుండా, రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు.  ఈ విధంగా సినిమాలు, రాజకీయాల్లో ఎంతో పేరు సంపాదించుకున్న బాలకృష్ణ వివాదాల్లో కూడా అంతే స్పీడ్ గా దూసుకుపోతున్నారు. ఆయన ఇప్పటివరకు  ఎన్నో వివాదాల్లో ఇరుక్కొని వాటి నుంచి బయటపడ్డారు.  తుపాకీతో నిర్మాతను కాల్చారు అంటూ కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. అలాంటి బాలకృష్ణ ఇప్పటివరకు ఎదుర్కొన్న వివాదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

 బాలయ్య కాంట్రవర్సీలు:
ఈయన వివాదాల పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబుని కాల్చినట్టు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ ఈ వివాదం పై బాలయ్యను తీవ్రంగా విమర్శించారు. ఓసారి సావిత్రి అనే మూవీ ఆడియో ఫంక్షన్ లో కూడా బాలయ్య మహిళలపై అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. ఈవ్ టీజింగ్ రోల్స్ చేసి కేవలం అమ్మాయిలను ఫాలో అయితే నా ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. ఒక కిస్సు లేదంటే ప్రెగ్నెంట్ చేయాలని మాట్లాడి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా తన అభిమానులపై కూడా చాలాసార్లు చేయి చేసుకున్నారు.ఓసారి బాలకృష్ణ తో సెల్ఫీ కోసం ఓ అభిమాని ప్రయత్నిస్తే చెంప దెబ్బ కొట్టాడు. మరో అభిమాని పొరపాటున తనపై పడితే చెంపదెబ్బ కొట్టాడు. అలాగే ఒక సినిమా షూటింగ్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ ని తన షూ లేస్ కట్టమని కోరాడు. అది కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.


మీడియా సమావేశంలో అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని నాగేశ్వరరావుని ఉద్దేశించి మాట్లాడిన మాటలతో బాలకృష్ణ వివాదంలో ఇరుక్కున్నారు. ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ కూడా స్పందించి బాలకృష్ణ పై ఫైర్ అయ్యారు. అలాగే అక్కినేని అభిమానుల చేత బాలకృష్ణ ట్రోలింగ్ కి గురయ్యారు. అంతేకాకుండా డిక్టేటర్ సినిమా ఈవెంట్లో అంజలీని గిల్లడం చాలా విమర్శలకు దారితీసింది. అయితే తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అంజలిని దూరంగా వెళ్ళమని నెట్టేయడం కూడా సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. అలాగే సినిమా ఈవెంట్ల కు తాగి వస్తారని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్లో బాలకృష్ణ చైర్ దగ్గర కింద రెండు వాటర్ బాటిల్స్ లో ఒకదాంట్లో నీళ్లు మరో దాంట్లో మద్యపానం ఉన్నట్లు కొన్ని ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఇలా బాలకృష్ణ మీద చాలా రూమర్లున్నాయి. ఈ విధంగా ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా బాలకృష్ణ నిలిచారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: