- కోరి వైసీపీతో కాంట్ర‌వ‌ర్సీ తెచ్చుకుంటోన్న సాయితేజ్‌
- బ‌న్నీలా కామ్ గోయింగ్‌గా ఉండ‌క కెలుక్కుంటోన్న మెగా మేన‌ళ్లుడు
- కూట‌మి గెలిచిన‌ప్పుడు సంబ‌రాలు ఇప్పుడు ఇదేంటి హీరో... ?

( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగాను ఉప ముఖ్యమంత్రిగాను బిజీగా ఉన్నారు. అటు మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి, రామ్ చరణ్, బన్నీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదే టైంలో అదే మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో సాయిధరమ్ తేజ్ ఇంకా రాజకీయాల్లో మునిగి తేలుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గెలిచిన వెంటనే సంబరాలు చేసుకున్నాడు సాయితేజ్‌. చిరంజీవి ఇంటికి పవన్‌ వచ్చినప్పుడు చాలా అల్లరి చేశాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తన సినిమా విషయాల్లో బిజీ బిజీ అయిపోయాడని చెప్పి అందరూ అనుకున్నారు.


అయితే సాయి తేజ్‌ ఇంకా ఆ పొలిటికల్ మూడ్‌లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అరాచకాల్ని సాయి తేజ్‌ చేస్తూన్నాడ‌ని.. వైసిపి వాళ్ళు కొందరు కామెంట్లు పెడుతున్నారు. కూటమి గెలిచినప్పుడు ఆంధ్రప్రదేశ్ సురక్షితమైన చేతుల్లో ఉందని సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. సాయి తేజ్ ఇప్పుడు స్పందించాలని.. వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలా ట్యాగ్ చేయటాలు, ట్రోల్ చేయ‌డాలు చాలా కామన్. రాజకీయాల్లో లేని సాయి తేజ్‌ లాంటి వ్యక్తులు ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేయాలి.


నిజానికి ఎన్నికల టైం లో చాలామంది హీరోలు.. రాజకీయ ప్రచారాలు చేశారు. నిఖిల్, బన్నీ లాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో కనిపించారు. వాళ్లను కూడా చాలామంది కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నా.. వాళ్లు అవేమీ పట్టించుకోరు. అల్లు అర్జున్‌ను.. జనసేన, టిడిపి కార్యకర్తలు ఒక రేంజ్ లో ఆటాడుకుంటున్నారు. అవన్నీ పట్టించుకుంటే సినిమాలు చేయలేం.. అందుకే బన్నీ తన పని తాను చేసుకుపోతున్నాడు. నిఖిల్ కూడా ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. సాయి తేజ్‌ మాత్రం ట్విట్టర్లో వైసీపీ కార్యకర్తలకు కోపం వచ్చేలా కెలికాడు. తనకు రాజకీయాల్లో తెలియని వాటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత రాజకీయాల గురించి ఆలోచన చేస్తానని.. ఎన్నికల టైం లో సాయితేజ్‌ చెప్పాడు.


అయితే ఇప్పుడు మాత్రం ట్విట్టర్‌లో ఎగ్ పప్స్ అంటూ సెటైర్స్ వేస్తున్నాడు. ఇది కావాలని వైసిపి వాళ్లను రెచ్చగొట్టేలా ఉంది. ఇక‌ సాయిధరమ్ తేజ్ ప్రమాదంలో గాయపడినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైసిపి ప్రముఖ నాయకులు.. ముఖ్యమంత్రి జగన్ లాంటి వాళ్ళు సైతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసి కోలుకోవాలని కోరుకున్నారు. ఇలాంటి టైంలో సాయిధరమ్ తేజ్‌కు కెలుకుడు అవసరమా.. అన్న విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. సాయి తేజ్ తగ్గకపోతే ఇది అతడి సినిమాలపై.. అతడి జయాపజయలపై కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది అన్న చర్చలు నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: