ఏది ఏమైనా జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మధ్య గ్యాప్ రోజురోజుకు పెరిగిపోతుంది. బన్నీ కూడా తనకు నచ్చినట్టుగా తాను ఉంటాను.. అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఈ విషయంలో ఎవరు.. ఏమీ.. అనుకున్న చివరకు తనకు.. కుటుంబం కన్నా.. తాను ఏం చేయాలనుకుంటే ? అదే చేస్తాను. తనకు స్నేహితులే ఎక్కువ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. బన్నీ వ్యవహరిస్తున్న తీరుతో జనసేన వాళ్లు, జనసైనికులు రెచ్చిపోతున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.


దీంతో జనసైనికులు ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. అల్లు అర్జున్ పై రెచ్చిపోతున్నారు. అల్లు అర్జున్‌ను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ గొడవలోకి అల్లు అర్జున్ మామ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కూడా దూరిపోయాడు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను పరోక్షంగా ఎత్తిచూపుతూ.. తప్పుపట్టి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలని చెప్పారు. ఇక ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు కూడా ఈ వివాదంలోకి దూరిపోయారు. బన్నీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సహజ శైలిలో బన్నీపై ఘాటైన విమర్శలు చేశారు.


 బన్నీ తన స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మాట్లాడాలి. ఈరోజు చిరంజీవి అభిమానులు బన్నీలో చిరంజీవిని చూసుకుంటున్నారు. అవన్నీ మరిచిపోయి నాకు ఇష్టం అయితేనే వస్తా.. అని మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినా నిన్ను రమ్మని ఎవరు.. పిలిచారు. నువ్వు వస్తే ఏంటి.. రాకపోతే ఏంటి.. పోటీ చేసిన ప్రతి చోటా నెగ్గాం. నువ్వు వెళ్ళింది ఒక్కచోటికి.. అక్కడ కూడా ఓడిపోయింది అని బొలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఈ గొడవలోకి జనసేన ఎమ్మెల్యే.. అందులోను పవన్ కళ్యాణ్‌కి సన్నిహితంగా ఉన్న వ్యక్తి స్పందించడంతో బన్నీకి జనసేన పూర్తిగా వ్యతిరేకం అని తేలిపోయింది. అలాగే జనసేన క్యాడర్.. జనసేన నాయకులు కూడా పూర్తిగా బన్నీకి వ్యతిరేకంగా ఉన్నారు అన్నది క్లారిటీ వచ్చేసింది. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి డౌట్ లు అక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: