ఏపీ బిజెపి అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి రెండు రోజుల క్రితమే బిజెపి విధానాలు నచ్చి.. తమ పార్టీలో చేరే వైసిపి నాయకులకు ఎప్పుడు ఆహ్వానం ఉంటుందని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీలో మిత్ర పక్షాలుగా ఉన్నాయి. అందుకే మిత్ర పక్షాలకు చెందిన పార్టీ నాయకులను తమ పార్టీలు చేర్చుకోమని తమ పార్టీ సిద్ధాంతాలనుంచి బిజెపిలో చేరే వైసిపి నాయకులకు రెడ్ కార్పెట్ వేస్తామని.. ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. పురందరేశ్వరి.. ఆ మాట అన్న రెండు రోజులకే విజయవాడ వైసిపి కార్పొరేటర్లకు కాషాయం కండువా క‌ప్పేశారు.


విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే వైసీపీకి ఎదురు పెట్టి వరుస షాకులు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే 39 వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ మంగళవారం బిజెపిలో చేరారు. పురందరిశ్వ‌రి ... పశ్చిమ ఎమ్మెల్యే య‌లమంచలి సుజనా చౌదరి సమక్షంలో పురందరేశ్వరి నివాసంలో కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలోని వైసిపి కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, హర్షద్, మైలవరపు మాధురి లావణ్య, టిడిపి ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో టిడిపిలో చేరారు. తాజాగా గుడివాడ నరేంద్ర రాఘవ కూడా బిజెపిలో చేరడంతో ఇప్పుడు మిగిలిన కార్పొరేటర్లు కూడా కూటమి పార్టీలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.


ఇక విజయవాడ అభివృద్ధి కోసం ఎవరు ముందుకు వచ్చినా.. కూటమి అండగా ఉంటుందని.. ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు వైసిపి అనేక దందాలు చేసి.. బల ప్రయోగం చేసి మరి కార్పొరేషన్ తమ ఖాతాలో వేసుకుంది. ఎప్పుడు అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో.. అప్ప‌టినుంచి విజయవాడ నగరంలోని వైసిపి నాయకులు.. కార్పొరేటర్లు అందరూ కూటమిలోని మూడు పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏది ఏమైనా బిజెపి చిన్నమ్మ, అటు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇద్దరూ విజయవాడ నగరంలోనూ పశ్చిమ నియోజకవర్గంలోనూ జగన్ వైసీపీని అంతం చేసేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp