వైసీపీ పార్టీకి అన్ని వైపుల నుంచి భారీ షాక్‌లు తగులుతున్నాయి. కోర్టులు, కేసులు, అవినీతి, అఫైర్లు బయటపడటం చెప్పుకుంటూ పోతే వైసీపీ వాళ్లని అన్ని సమస్యలు చుట్టూ ముడుతున్నాయి. దీనివల్ల వైసిపికి చాలా చెడ్డ పేరు వస్తోంది. జగన్ చేసిన మంచి మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఇక అధికారంలో ఉన్నంతకాలం వైసీపీలో రాజభోగాలు అనుభవించిన కొంతమంది నేతలు ఎలాంటి కృతజ్ఞతా భావం చూపించకుండా కానీ వదిలేస్తున్నారు. అతి త్వరలోనే  ఈ పార్టీకి మరో భారీ షాక్ తగలనుందని సమాచారం. ఓ

వైసీపీ సీనియర్ నేత గురువారం రోజు పార్టీకి రాజీనామా చేయనున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నేత మరెవరో కాదు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. వైసీపీ పార్టీని ఎందుకు వీడుతున్నారో కూడా కారణాలు తెరపైకి వస్తున్నాయి. టీడీపీ పార్టీలో చేరడానికే ఆయన వైసీపీని వదిలేస్తున్నారని తెలుస్తోంది. ఆగస్టు 29న అంటే గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా ఆయన కప్పుకోనున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం వైసీపీలో భూకంపం వచ్చింది అన్నట్లుగా తెలుస్తోంది.

ఎంపీ మోపిదేవి వెంకటరమణ బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఆయన నిజంగానే రాజీనామా చేసినట్లయితే వైసీపీలో ఒక బలమైన నేత పోయినట్లే అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన వెళ్లిపోవడం ఒక పెద్ద లాస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏపీ అసెంబ్లీలో కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితమైంది. ఈ ఘోర పరాజయం పాలైన తర్వాత టిడిపి నేతలు వైసిపి నేతలపై కేసులు పెడుతున్నారని దాడులు చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. కొడాలి నాని లాంటి చాలామంది టీడీపీ టార్చర్ చేస్తుందేమో అని భయపడి కనిపించకుండా వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఆ పార్టీలోకి వెళ్లిపోయేవారు కూడా భయపడే వెళ్తున్నట్లుగా సమాచారం మరి కొంతమందికి మాత్రం రాజకీయ భవిష్యత్తు కోసం సైకిల్ కండువా కప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: