ముఖ్యంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు తీర్మానం చేసినట్లుగా తెలుస్తోంది. పట్టా పాసుపుస్తకాల పైన జగన్ పేరు బొమ్మలు తొలగించేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలియజేసినట్లు తెలుస్తోంది..21.86 లక్షల పట్టాదారుల పాత్ర పుస్తకాల పైన కూడా కొత్తగా రాజుముద్రణ ఇచ్చి కొత్త పాసు పుస్తకాలను ఇచ్చేలా చేస్తోంది. అలాగే 77 లక్షల సర్వే రాళ్లపైన మాజీ సీఎం బొమ్మను తొలగించేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది..22A, ఫ్రీ ఓల్డ్ భూములు వివాదాల పైన కూడా ఆమోదం లభించింది. వివాదాలలో ఉన్నటువంటి భూములను రిజిస్ట్రేషన్ నిలిపివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
వీటితో పాటుగా రాష్ట్రంలో కొత్తగా 2,774 రేషన్ దుకాణాలకు గ్రీన్ సిగ్నల్. రేషన్ షాపుల్లో ఫోర్టి ఫైడ్ బియ్యం అందించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ద్వారా సుమారుగా రూ .330 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారట. అలాగే కొత్త మద్యం పాలసీ తెచ్చే అంశం పైన కూడా క్యాబినెట్ ముందు పలు రకాల ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఉచిత ఇసుక విధానాన్ని కూడా మరింత సులభతరంగా చేసేలా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రతిపాదనలు తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే సీఎం షెషి, సీఎంకు అధికారుల పేషీలలో ఖాళీగా ఉన్న 71 పోస్టులకు భర్తీ చేయడమే కాకుండా మంత్రుల పేషీలలో బలోపేతం చేయడానికి 96 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం.