చంద్రబాబును గతేడాది చివరిలో జైలులో పెట్టినప్పుడు కూడా.. పవన్ కళ్యాణ్, బాలయ్య కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. అదే సమక్షంలో పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించడంతోపాటు.. ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం కలిసి వెళుతున్నాయని చెప్పారు. వెంటనే బాలయ్య - పవన్ కళ్యాణ్ ఆలింగనం కూడా చేసుకున్నారు. ఇక బాలయ్య కూడా.. ఎక్కడా మాట తూలకుండా తన స్టైల్ లో రాజకీయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేనకు బాగా సపోర్ట్ చేసే మీడియా సంస్థలలో కూడా గతంలో చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు వచ్చిన బాలయ్యను పెద్దగా పట్టించుకునేవారు కాదు.
బాలయ్య సినిమాల విషయంలో ప్రయారిటీ ఉండేదే కాదు. ఇక అన్‌స్టాపబుల్ షోకు పవన్ కళ్యాణ్ వచ్చాక బాలయ్య, పవన్ బంధం మరింత బలపడింది. ఇది పవన్ కళ్యాణ్ అంటే యాంటిగా ఉంటున్న అల్లు అరవింద్.. బన్నీ కాంపౌండ్ కు చెందిన ఆహాలో ప్రసారమైన షో అయినా కూడా.. బాలయ్య పిలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ వచ్చారు. నాటి నుంచి నేటి వరకు వీరి బంధం క్రమక్రమంగా బలపడుతూ వస్తోంది. ఇక జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా బాలయ్య హిందూపురంలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు.. తన తల్లి బసవరామతారకం పేరుతో క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం... బాలయ్య భోళాతనాన్ని బాగా హైలెట్ చేస్తున్నాయి. ఇది ఇటీవల కాలంలో బాగా వచ్చిన మార్పుగా చెప్పుకోవాలి.