కోలికపూడి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి మొదటిసారి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు. స్థానికుడు కాకపోయినప్పటికీ.. ఎన్నికలకు నెలరోజుల ముందే నియోజవర్గానికి వచ్చిన స్థానిక పరిస్థితులు అనుకూలించి కూటమిగాలి బలంగా వియ్యడంతో మొదటి ప్రయత్నంలోనే చట్టసభకు వెళ్లారు ఆయన.. 20 ఏళ్లుగా టిడిపికి కలిసి రాని తిరుపూరి వర్గంలో కొలికపూడి రానీ రికార్డు మెజారిటీ గెలవడంతో మళ్లీ తిరువూరులో టిడిపి జెండా ఎగిరింది. దీంతో అటు పార్టీకి , అధిష్టానానికి కూడా ఆశాదీపంగా మారారు ఈ ఎమ్మెల్యే.


ముందు ముందు కొలికపూడి శ్రీనివాసరావు బలమైన నేతగా అవుతారని ఆశలు పెట్టుకుందట అధిష్టానం. అయితే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి.. ఆయన వ్యవహరిస్తున్న తీరు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నది. ఇది అధిష్టానాన్ని కూడా ఇబ్బంది పెడుతోంది అన్నది లోకల్ గా పార్టీ టాక్ వినిపిస్తోంది. అయిన దానికి కాని దానికి ఎమ్మెల్యే అతిగా రియాక్ట్ అవుతున్నారనే విధంగా టాక్ వినిపిస్తోంది. ఎళ్ల తరబడి తిరువూరులో టిడిపి గెలవకపోవడంతో  లోకల్ గా పార్టీ క్యాడర్ ఇబ్బందులు ఎదుర్కొందనే అభిప్రాయం కూడా ఉన్నది.



అయితే తానేంటో నిరూపించుకోవాలన్నది అత్యుత్సాహమో, తపను ఏంటో తెలియదు కానీ.. ఆయన చేసే చాలా చర్యలు వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. వైసీపీ నేత నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించారంటూ వాటిని కూల్చే పనిలో జెసిపితో సహా వెళ్లి కోలికపుడి చేసిన హంగామా రాష్ట్రవ్యాప్తంగా కలకలాన్ని సృష్టించింది. ఈ విషయం పైన అధిష్టానం కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్రమాలకు సంబంధించి స్పందించకపోవడం తమలాంటి నేతలకు ఎమ్మెల్యే పదవి వృధా అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ షేర్ చేశారు. ఇది ఒక సంచలనంగా కూడా మారింది. అలాగే నియోజవర్గంలో ఉండేటువంటి రహదారిలా రోడ్లను కూడా గుంతలను పూడ్చలేదని స్వయంగా ఆయన నిరసనకు దిగారు ఎమ్మెల్యే కూలికపూడి.. ముఖ్యంగా ఆయనే రోడ్ల మీద కూర్చి వేసుకొని కూర్చున్నారు. అలాగే మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని వార్తలు వినిపించడంతో ఆయన చర్చకు రావాలంటు సూచించారు. ఈ సవాల్ టిడిపి వైసిపి నేతల మధ్య మారిందని లోకల్ టాక్. అలాగే ఒకరి దగ్గర 50 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని తాసిల్దార్ అన్నారని ఆయనకు సమాచారం రావడంతో.. తనమీద విచారణ జరిపించాలని కలెక్టర్ కి కూడా లేఖ రాశారు. ఇలా నిజానిజాలు తెలుసుకోకుండా ఓవర్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.ఈయన అయినదానికి కాని దానికి  అతిగా స్పందిస్తున్నారన్నదే లోకల్ టాక్ నడుస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: