ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పాలన విషయంలో ఒక్క రిమార్క్ కూడా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తప్పు చేసింది సొంత పార్టీ నేతలైనా ఒకింత కఠినంగానే వ్యవహరించనున్నారు. మంత్రుల 100 రోజుల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. జనసేన మంత్రుల రిపోర్ట్ ను పవన్ కు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని భోగట్టా.
 
వివాదాస్పద తీరుతో వార్తల్లో నిలిచిన మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని సమాచారం అందుతోంది. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నా కొందరు నేతలు చేస్తున్న చెడ్డ పనుల వల్ల ప్రభుత్వం పరువు పోతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారని భోగట్టా.
 
కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పినట్టు సమాచారం. ఒకరిద్దరు చేసిన తప్పుల వల్ల ప్రభుత్వం చేసిన మంచి పనులు హైలెట్ కావడం లేదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. కేబినేట్ భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధానంగా రాజకీయ అంశాల గురించి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
 
గత ప్రభుత్వం ప్రజలను మాయ చేయాలనే ఆలోచనతో మాత్రమే రివర్స్ టెండరింగ్ ను అమలు చేసిందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇసుక పాలసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. చంద్రబాబు చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఒకింత సీరియస్ గా వ్యవహరించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మంత్రులు తమ తీరును మార్చుకుంటారేమో చూడాలి. చంద్రబాబు నాయుడు పాలనలో  తన మార్క్ చూపిస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఏపీకి బెస్ట్ సీఎంగా ప్రశంసలు అందుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమానికి ఆయన సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్రబాబు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పథకాలను అమలు చేయాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: