మాజీ సీఎం వైఎస్ జగన్ సైలెంట్ గా ఉంటే మాత్రం వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీలోని కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. కీలక నేతల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో జగన్ ఫెయిల్ అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీని వీడే నేతల్లో మరి కొందరు ప్రముఖులు ఉండనున్నారని తెలుస్తోంది.
 
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడటానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుండగా రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, పోతుల సునీత సైతం జగన్ కు షాకిచ్చే నేతల జాబితాలో ఉండనున్నారని తెలుస్తోంది. ఈ నేతలలో ఎంతమంది నేతలు పార్టీ అధికారంలో లేకపోయినా జగన్ తో కొనసాగడానికి ప్రాధాన్యత ఇస్తారో చూడాల్సి ఉంది.
 
జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతుందని ఎవరూ ఊహించలేదు. కొంతమంది నేతలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారానికి దూరంగా ఉండటానికి అయితే ఇష్టపడరు. అలాంటి నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.
 
అయితే పార్టీ నేతలు మారాలని అనుకున్నా టీడీపీ వాళ్లను పార్టీలో చేర్చుకుంటుందా అనే ప్రశ్నకు సైతం చెప్పలేమనే సమాధానం వినిపిస్తోంది. జగన్ పార్టీని, పార్టీలోని కీలక నేతలను సైతం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. అధికారం రాష్ట్రంలో ఏ పార్టీకి శాశ్వతం కాదు. ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేమనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో జగన్ ప్లాన్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది. జగన్ కు ప్రజల నుంచి మాత్రం బాగానే సపోర్ట్ దక్కుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: