ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పెన్షన్‌ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటోంది.ఏపీవ్యాప్తంగా సుమారు 66 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా కింద పింఛన్లు అందుతున్నాయి. వీరిలో సుమారు 48 లక్షల 92 వేల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీరందరికీ పింఛన్ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్న సంగతి తెలిసిందే.బ్యాంకు అకౌంట్లు లేనివారికి, దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందిస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలావుండగా ఏపీలో పింఛన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సెప్టెంబర్ నెల పెన్షన్ నగదును ఒక రోజు ముందుగానే అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31నే ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31న పింఛన్ అందకపోతే ఆగస్టు 2న పంపిణీ చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది.కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పింఛనదారుల నగదును పెంచింది. గత ప్రభుత్వం రూ. 3 వేలు అందజేస్తే.. కూటమి ప్రభుత్వం రూ. 4 వేలు పంపిణీ చేస్తోంది. వార్డు వాలంటీర్లతో జగన్ సర్కార్ ఇంటివద్దనే పింఛన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందించింది. కూటమి ప్రభుత్వం సైతం పింఛన్ ను ఇంటికే తీసుకెళ్లి అందజేస్తోంది. అయితే వార్డు వాలంటీర్లకు బదులు సచివాలయం సిబ్బందితోనే పింఛన్ లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయిస్తోంది. సెప్టెంబర్ వస్తుండటంతో పెన్షన్ పంపిణీకి ప్రభుత్వం సర్వంసిద్ధం చేస్తోంది. ఇదిలావుండగా ఏపీలో మార్చి నెల వరకూ వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్లతో పింఛన్ల పంపిణీ వద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనలతో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది . లబ్ధిదారులకు పింఛన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో వేయాలని, బ్యాంకు అకౌంట్లు లేనివారికి ఇంటివద్దనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో పింఛన్ దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: