హైదరాబాద్లో హైడ్రా ప్రకంపనలు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలలోనూ ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన భూములను పరిరక్షించడం కోసం ఏర్పాటుచేసిన హైడ్రా వ్యవస్థ చాలా బలంగా పని చేస్తుంది. ఎంతటి బలవంతులైన సరే ఆక్రమణలతో భవన నిర్మాణాలు చేశారంటే బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు.హైడ్రా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్ట మవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు.కాంగ్రెస్ పార్టీ నేతలైనా, మంత్రులైనా సరే వెనక్కి తగ్గేది లేదని హైడ్రా తేల్చి చెప్పింది.తాజాగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేతతో ఈ అంశం పీక్స్‌కి చేరింది. రాజకీయంగా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.. 'హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌' అంటే ఎవరికీ తెలియదు. హైడ్రా అనగానే అందరికీ ఆక్రమణల కూల్చివేతలే గుర్తొస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది. ఒకప్పుడు చెరువులు, కుంటలతో కళకళలాడిన హైదరాబాద్‌ మహా నగరం నేడు కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. చినుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపించేలా మారుతున్నాయి.

ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి, నాలాలాను మూసేసి నిర్మాణాలు చేపట్టడమే అని ప్రభుత్వం అంటోంది. హైదరాబాద్‌ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగానే హైడ్రాను ఏర్పాటు చేశామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఈ హైడ్రాను విస్తరించారు. హైడ్రా పనితీరుతో తెలంగాణ ప్రజల్లో రేవంత్‌రెడ్డి హీరో అయ్యారు. తమ తర బేధం లేకుండా.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అనే తేడా చూపకుండా హైడ్రా బుల్లోజర్లకు స్వేచ్ఛ ఇవ్వడంతో సీఎంపై ప్రశంసలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ఆక్రమణల నుంచి చెరువులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థకు పార్టీలకు అతీతంగా సపోర్ట్ లభిస్తుంది. తాజాగా హుస్నాబాద్ లో పలువురు బిజెపి నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. హైడ్రాను స్వాగతిద్దాం. అభినవ భగీరధుడు చెరువులను, కుంటలను సంరక్షించే సీఎం రేవంత్ రెడ్డికి అండగా నిలుద్దాం. పార్టీలకు అతీతంగా మద్దతు ఇద్దాం. అని ఫ్లెక్సీల్లో ముద్రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: