వైసిపి పార్టీ 2024 లో ఘోరంగా ఓడిపోవడంతో చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ ఉన్నారు. మరి కొంత మంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి జంపు అయ్యే విధంగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే వైసిపి పార్టీ రాజ్యసభలు విజయసాయిరెడ్డి పార్టీ మారుతున్నారనే విషయాలు గత కొంతకాలంగా వినిపిస్తూ ఉండడంతో ఈ విషయం పైన కూడా తాజాగా క్లారిటీ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లుగా కొద్దిరోజులుగా జోరుగానే ప్రచారం వినిపిస్తోంది. ఇందులో ఎలాంటి నిజం లేదంటూ తెలియజేశారు.


తాను వైయస్ జగన్మోహన్ రెడ్డి న్యాయకత్వంలోనే పనిచేస్తానని వైఎస్ఆర్సిపి లోనే తాను కొనసాగుతానానికి కూడా తెలియజేశారు.. అలాగే వైసిపి పార్టీకి తాను విధేయత, నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఉంటానని కూడా తెలిపారు. వైసీపీని వీడి మరో రాజకీయ పార్టీలో చేరుతారని కొన్ని మీడియా వర్గాలు పదేపదే ఊదరగొడుతున్నాయి. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తానని తెలియజేశారు. గత లోక్సభ ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తనకు నచ్చనిచోట పోటీ చేయించారని రూమర్స్ కూడా వినిపించాయి.


అప్పటి నుంచి తాను కాస్త అసంతృప్తితో ఉన్నారని అందుకే పార్టీని వీడుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తల పైన విజయసాయిరెడ్డి స్పందిస్తు తాను ఎప్పటికీ వైసీపీ పార్టీలోనే ఉంటానంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలా మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం పార్టీని మారుతూ ఉన్నారు. గతంలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను పార్టీ మారుతాను అనే వ్యక్తులను  ఆపనని ఉండే నేతలను వెళ్ళమని చెప్పనని కూడా తెలియజేశారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా మన పార్టీని మళ్లీ వస్తుందని కూడా తెలియజేశారు. ఇక కూటమి ప్రభుత్వం కూడా టిడిపి పార్టీ లోకి చేరాలి అంటే కొన్ని కండిషన్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: