* పార్టీ నేతలను కాదని బయటనుండి వచ్చిన వారికే జగన్ ప్రాధాన్యత

* ఆ కీలక నేతను గుడ్డిగా నమ్ముతున్న జగన్..

* ఇదే జరిగితే పార్టీలో అంతరయుద్ధం జరగక తప్పదా

* రాజకీయంగా జగన్ ముందు ముందు భారీ సవాళ్లు.. ఏం చేస్తారో..?



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయ దుందుబి మ్రోగించింది.. కూటమి ధాటికి వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.. కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది.. అయితే వైసీపీకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అధికారంలో వున్నప్పుడు నాయకులు చేసిన అరాచకాలే ఇప్పుడు వైసీపీనీ ఘోరంగా దెబ్బ తీస్తున్నాయి.. సొంత పార్టీ నేతలను నమ్మని జగన్ వేరే పార్టీ వీడి వచ్చిన నాయకులకు ఉన్నత పదవులని ఇచ్చి అందలం ఎక్కిస్తున్నారు.ప్రస్తుతం పార్టీ సీనియర్ నేతగా వున్న బొత్స విషయంలో కూడా అదే జరిగింది .

గతంలో తన తండ్రిని, తల్లిని అవమానించిన బొత్సను పార్టీలోకి చేర్చుకొని జగన్ తప్పు చేసారని వైసీపీ నేతలు ఇప్పటికీ బాధపడుతున్నారు.బొత్స విషయంలో వైసిపిలో చీలిక రానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీలో ప్రస్తుతం అంతర్గతంగా ఇదే చర్చ నడుస్తోంది. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్ గా బొత్స కొనసాగారు. కాంగ్రెస్ కు మళ్ళీ పూర్వ వైభవం వస్తే ఈ సారి ముఖ్యమంత్రి గా అవకాశం వస్తుందని ఆయన భావించారు. అయితే కాంగ్రెస్ పుంజుకోకుండా చతికలబడటంతో రాజకీయంగా తన భవిష్యత్ గురించి అలోచించి వైసిపిలో చేరారు.


2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బొత్స ఉత్తరాంధ్రలో పార్టీ విజయానికి కారణం అయ్యారు.. దానితో జగన్ క్యాబినెట్లో  ఆయనకు చోటు దక్కింది. కానీ బొత్సకు మాత్రం ఆ పదవి సరిపోలేదు. ఒకప్పుడు రాష్ట్రంలో కీలక నేతగా వున్న ఆయన ఇప్పుడు తనకంటే చిన్నవాడైన జగన్ కాబినెట్ లో మంత్రిగా ఉండటం చాలా ఇబ్బందిగా భావించారని చాలా మంది అంటుంటారు..రాష్ట్రంలో కీలక పదవి దక్కించుకోలేకపోయాను అనే భావన ఆయనను వెంటాడుతుంది.. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బొత్స దారుణంగా ఓడిపోయారు. పదవి లేకుండా పది నిముషాలు కూడా ఉండలేని బొత్స జగన్ ను ఎలాగోలా ఒప్పించి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని పార్టీలో చాలా మంది చెప్పుకుంటున్నారు...బొత్సకు పదవి అందించి చేజేతులా జగన్ బొత్సకు వరం అందించారని ఇక బొత్సను ఆపడం కష్టమని వైసీపీ నేతలు భావిస్తున్నారు..


ప్రస్తుతం జగన్ ప్రతిపక్ష నేత కూడా కాదు. ఆయనకు ప్రజలు ఆ హోదాను కూడా ఇవ్వలేదు.బొత్స కు మాత్రం క్యాబినెట్ హోదా దక్కనుంది.  వైసీపీ నేతల్లో అనుమానానికి తావిస్తుంది.. బొత్స వద్ద చాలా రకాల ప్లాన్లు ఉన్నాయని.. త్వరలో వాటిని అమలు చేస్తారని వైసీపీ నేతలు తమలో తాము చర్చించుకుంటున్నారు.. జగన్ వచ్చే నెలలో లండన్ వెళ్తున్నారు.. రాష్ట్రంలో వైసీపీకి గడ్డు పరిస్థితులు, మన అనుకున్న నేతలు పార్టీని వీడటం ఇలాంటి కీలక పరిణామాలు జగన్ కు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి..అయితే త్వరలో వైసీపీ లో అంతర యుద్ధం మొదలవుతుందని అంతా అనుకుంటున్నారు. ఇదే జరిగితే రాజకీయంగా జగన్ ను పెద్ద పరాభవం ఎదురవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: