* పార్లమెంటు ఎన్నిక‌ల్లో గుండు సున్నా

* బీఆర్‌ఎస్‌ మనుగడపై కమ్ముకున్న నీలి నీడలు  

* భవిష్యత్తులో పార్టీ కనుమరుగు  

( తెలంగాణ - ఇండియాహెరాల్డ్)

సున్నా, గుండు సున్నా ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి వచ్చిన సీట్లు. తిరుగులేని పార్టీగా తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన బీఆర్‌ఎస్‌ లోక్‌సభ స్కోర్‌బోర్డ్‌లో పెద్ద జీరోకే పరిమితం కావడం అందరికీ షాక్‌కి ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ఖాతా క్లోజ్ అయిపోయిందని ఈ ఫలితాలే చెబుతున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ వయోభారం కారణంగా పార్టీని రివైవ్ చేయడంలో కూడా కష్టమే అని అంటున్నారు. బీజేపీ పార్టీకి కూడా 8 సీట్లు వచ్చాయి. కానీ బీఆర్‌ఎస్‌ ఖాతా కూడా ఓపెన్ చేయకపోవడం ఆ పార్టీ నేతలకు పెద్ద అవమానకరంగా మారింది. జనాలు ఇకపై బీఆర్‌ఎస్‌ పార్టీని నమ్మరా? అనే ఒక అనుమానం కూడా తలెత్తుతుంది.

మరోవైపు చాలామంది బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నారు. బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ స్థానాలు నిల్. జస్ట్ 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కు ఎన్నడూ లేనంత గడ్డుకాలం ప్రస్తుత నడుస్తోంది. జస్ట్ రూ.1,000 కోట్ల పార్టీ ఫండ్‌తో జాతీయ స్థాయికి వెళ్లాలని బీఆర్‌ఎస్‌ అనుకుంది. మోదీని గద్దే దించుతాం అంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్ సొంత రాష్ట్రంలోనే ఓడిపోవడం ఆయన పరువు తీసేసింది. లోక్‌సభలో ఒక్క సీటు కూడా గెలవలేని కేసీఆర్ దాదాపు 300 సీట్లు గెలుచుకున్న ఎన్డీయే ముందు తలెత్తుకోలేకపోయారు.

ఇది ఒక చాలా పెద్ద అవమానకర  ఓటమి అని పరిశీలకులు అంటున్నారు. కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ కావడం కూడా బిఆర్ఎస్ కి చాలా పెద్ద మైనస్ అయింది. ఆమె జైల్ నుంచి బైల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ఏదో పార్టీని బలోపేతం చేస్తాను అని చెబుతున్నారు కానీ ప్రజల్లో పార్టీపై బాగా ఆగ్రహం ఉన్నట్లుగా తెలుస్తోంది. దళితబంధు, రైతుబంధు అంటూ వర్గాల ప్రజలకు మాత్రమే డబ్బులు ఇచ్చి పేదవాళ్ళకి ఇల్లు కూడా కట్టించిన కేసీఆర్ వింటేనే కొందరికి కోపం కట్టలు తెంచుకుంటుందని సమాచారం. ఈ పరిస్థితులను గమనిస్తే బీఆర్‌ఎస్‌ పుంజుకునే అవకాశమే లేదని తెలుస్తోంది. ఇది ఉనికిలో లేకుండా పోతుంది అని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: