ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ప్రత్యేక ఉద్దేశంతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పార్టీని స్థాపించిన మొదట్లో కేసీఆర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. పెద్ద పెద్ద పార్టీలతో పోటీ పడ్డాడు. పార్టీని ప్రారంభించిన మొదటి దశలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం , కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. ఆ పార్టీల పోటీని తట్టుకొని మరి టిఆర్ఎస్ పార్టీ నిలబడింది. ఇక కెసిఆర్ అనేక సార్లు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాడు. ఇక 2009 వ సంవత్సరం నుండి ఈ ఉద్యమం ఉదృతమయింది.

ఈ ఉద్యమానికి తెలంగాణ ప్రజల నుండి అద్భుతమైన స్థాయిలో సపోర్ట్ వచ్చింది. దానితో కేంద్రం 2014 వ సంవత్సరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు వచ్చాయి దానితో చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీ భారీ అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. దానితో కెసిఆర్ రెండవ సారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2023 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక ఒక్క సారిగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్థానాలు భారీగా తగ్గిపోయాయి. ఇక చూస్తే 2024 వ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క పర్లమెట్ సీటు కూడా రాలేదు.

దానితో ఈ పార్టీ మనుగడ ఎటు వైపు వెళుతుందా అనే అనుమానం కూడా చాలా మం దిలో వ్యక్తం అవుతూ వచ్చింది. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది నేతలు ఉన్నా కూడా భారం అంతా ఓ ఇద్దరిపైనే పడింది. కేసీఆర్ మొదటి నుండి కూడా ఓటమి తర్వాత ఎక్కువగా జనాల్లో తిరగడం లేదు. బయటికి కూడా ఎక్కువ రావడం లేదు. దానితో కేటీఆర్ , హరీష్ రావు మాత్రమే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీపై తమదైన స్థాయిలో విరుచుకుపడుతూ వస్తున్నారు. దానితో వీరిద్దరే బీఆర్ఎస్ పార్టీ భారాన్నంతా మోస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Brs