ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.ఏపీలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత... ఆ పార్టీలో ఎవరు ఉండడానికి ఇష్టపడడం లేదు. పక్క పార్టీలవైపు చూసేందుకు వైసిపి నేతలు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది నేతలు వైసిపికి రాజీనామా పెట్టి...జగన్కు షాక్ ఇచ్చారు.

 
అయితే తాజాగా మరోసారి జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. వైసిపికి ఏకంగా ఏడుగురు ఎంపీలు  రాజీనామా పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈ ఏడుగురు ఎంపీలలో అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, మేడ రఘునాధ రెడ్డి, బీద మస్తాన్ రావు  వైసిపి కి గుడ్ బాయ్ చెప్పే యువజనలో ఉన్నారని సమాచారం.

 
అయితే ఇవాళ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ రావులు ఇద్దరూ వైసీపీ పార్టీకి అలాగే తమ పదవులకు రాజీనామా చేయబోతున్నారని సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో రాజ్యసభ చైర్మన్ కు తమ రాజీనామా పత్రాన్ని కూడా అప్పగించనున్నారట. అదే సమయంలో వైసీపీకి కూడా గుడ్ బై చెప్పబోతున్నారని సమాచారం.


అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి... తమ భవిష్యత్తు రాజకీయ జర్నీ పై ప్రకటన చేయనున్నారు మోపిదేవి అలాగే మస్తాన్ రావు. అయితే ఈ ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారని ప్రాథమిక సమాచారం అందుతోంది.  ఇలాగే వైసిపి రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించి..  టిడిపి పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా రాజీనామా చేస్తే కచ్చితంగా మ ళ్ళీ ఆ ఖాళీ అయిన స్థానాలకు బై ఎలక్షన్స్ ఉంటాయి. అప్పుడు కూటమి పార్టీలు ఆ స్థానాలను పంచుకునే ఛాన్స్ ఉంది. మరి దీని పై జగన్ మో హన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: