- కవితను కష్టపెడుతున్న లిక్కర్ పాలసీ కేసు.
- సంక్షోభంలో బీఆర్ఎస్.
- వయోభారంతో కేసీఆర్.


తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పగానే చాలామందికి టక్కున గుర్తుకొచ్చే పొలిటీషియన్ కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని చెప్పవచ్చు. చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని సిద్ధింపజేసి ఆయనే 10 సంవత్సరాలు రాష్ట్రానికి సీఎంగా పాలన అందించారు. ఆయన పాలనలో ఎన్నో పథకాలు తీసుకువచ్చి పేద ప్రజలకు దగ్గరయ్యాడు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ప్రతి ఒక్కరు గుర్తించే విధంగా తీసుకెళ్లారని చెప్పవచ్చు. కానీ కేసీఆర్ ఇన్ని చేసిన ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయన కిందిస్థాయిలో నాయకులు మరియు ఆయనకు ఉండే అహంకారం అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా కేసీఆర్ తన పతనాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. అంతేకాదు అధికారం పోగొట్టుకోగానే తన కూతురు కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుంది. దాదాపు 5 నెలలకు పైగా జైల్లో ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డ కవిత తాజాగా బెయిల్ పై బయటకు వచ్చింది. అలాంటి కవిత గురించి కొన్ని వివరాలు చూద్దాం..

 కవిత కష్టాలు:
 తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చేలా చేయడంలో కవిత ప్రముఖ పాత్ర పోషించారని చెప్పవచ్చు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా బతుకమ్మ పండుగ విశిష్టత గురించి చాటిచెప్పారు.  అలాంటి కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు  విలాసాలు అనుభవించింది. ఎప్పుడైతే అధికారం పోయిందో కవిత చేసినటువంటి కొన్ని దందాల గురించి  వార్తలు వచ్చాయి. దీంతో సీబీఐ, ఈడి విచారణలు చేపట్టి  లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేసి చివరికి తీహార్ జైలుకు పంపారు. దాదాపు 5 నెలల పాటు ఆమె అక్కడే ఉన్నారు. కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఓ వైపు అధికారం కోల్పోవడం మరోవైపు కూతురు జైలుకెళ్లడం కేసీఆర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కనీసం పార్లమెంట్ ఎలక్షన్స్ లో అయినా గాడిన పడతాం అనుకున్న కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. పార్లమెంటు ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో  ఆయన పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలా తయారైంది.


 దీనికి తోడు కేసీఆర్ వయసు మీద పడడం, బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పంచన చేరడం, ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతూ వస్తోంది. అసలు పార్టీని గాడిన ఎలా పెట్టాలో కూడా కేసీఆర్ కు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారట. 10 సంవత్సరాలు ఏకధాటిగా పాలించిన కేసీఆర్  ఇన్ని కష్టాలు ఒకేసారి రావడంతో ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆయన చివరికి తన కూతురును బెయిల్ మీద  బయటకు అయితే తీసుకురాగలిగారు. కానీ కేసు ఇంకా ఎటువైపు దారితీస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది. కవిత పరిస్థితి సీత కష్టాల కంటే ఎక్కువ ఇబ్బందికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఇదే కాకుండా  ఇప్పుడు బీఆర్ఎస్  పార్టీ పగ్గాలు హరీష్ రావుకి ఇస్తే బాగుంటుందా, కేటీఆర్ కి ఇస్తే బాగుంటుందా అనే డైలమాలో కూడా కేసీఆర్ ఉనట్టు తెలుస్తోంది. అల్లుడికి ఇస్తే పవర్స్ అన్ని ఆయనకెళ్ళిపోతాయి. ఒకవేళ కొడుక్కి ఇస్తే  పార్టీని గాడిలో పెట్టే శక్తి లేదు. ఈ విధంగా కేసీఆర్  అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ వస్తున్నారని చెప్పవచ్చు. ఇదే తరుణంలో కవిత కేసు ఎటువైపు మలుగు తిరుగుతుందో తెలియక కూడా ఆయనలో లోపల మదన పడుతున్నారట. మరి చూడాలి  బెయిల్ మీద బయటకు వచ్చిన కవిత  పార్టీ బలోపేతానికి ఏమైనా  ప్లాన్లు వేస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: