* వైసీపీ సంక్షోభానికి కారణం.. 'జగనే'..!
* వైసీపీ నుండి 'క్యూ' కడుతున్న మాజీమంత్రులు,ఎమ్మెల్యేలు..!
* మేకపోతు గాంభీర్యం చూపుతున్న జగన్..!

(ఏపీ-ఇండియాహెరాల్డ్): ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 80 రోజులు కానుంది.ఇటీవల జరిగిన ఎన్నికలలో 164 సీట్లు సాధించి వైసిపిను 11 స్థానాలకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా అనే లేకుండా చేసింది. ఒకవైపు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పార్టీకి ఇటీవల కాలంలో షాకుల మీద షాకులు ఇస్తున్నారు వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను నువ్వే అంతా.. అన్న వాళ్ళందరూ నేడు నువ్వెంత అనేలా ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు.అయితే జగన్ తన 11 మంది ఎమ్మెల్యేతో అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీని ప్రశ్నించడం వదిలేసి ఏవేవో కుంటి సాకులు చెప్పి అసెంబ్లీకి వెళ్లకుండా కాలయాపన చేస్తున్నారు. గతంలో వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు వారి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వైసీపీని వీడి టిడిపి, జనసేన లోను మరి కొంతమంది బిజెపిలోనూ మారి జగన్కు షాక్ ఇస్తున్నారు.అయితే ఆ ఎన్నికల్లో సీటు కోసం ఆశించి భంగపడిన నేతలంతా తాజాగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు రోజుల్లోనే మాజీ మంత్రి రావెల కిషోర్ వైసీపీకి రాజీనామా చేసారు.బాపట్ల ఎంపీ టిక్కెట్ ఆశించిన ఆయనకు ఎన్నికల ఫలితాలు అనుకూలంగా లేకపోవడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.అలాగే 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అలీ..పార్టీ అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం చేయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ అలీకి వైసీపీలో ఎటువంటి పదవులు లభించక పోవడంతో అలాగే తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా సమయంలో వైసీపీ పార్టీకి రాజీనామా చేసి భారీ షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య.పార్టీ కోసం ఎంతో కష్టపడిన గుర్తింపు దక్కలేదని పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు రోశయ్య. అలాగే తాజా ఎన్నికల్లో మద్దాలి గిరిధర్‌కు టికెట్ నిరాకరించి విడదల రజినికి టికెట్ ఇవ్వడంతో మద్దాలి గిరి వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉండి ఎన్నికల ఫలితాల తర్వాత అదును చూసుకొని పార్టీకి రాజీనామా చేశారు.అలాగే ప్రకాశం జిల్లా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ అవకాశం ఇవ్వలేదని మనస్థాపం చెందిన ఆయన తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు.మరోవైపు ఓటమి ఎదురైన వెంటనే విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.పెండ్యం దొరబాబు విషయానికి వస్తే పవన్ పోటీ చేసి గెలిచిన పిఠాపురం నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు పెండ్యం దొరబాబు.కానీ పవన్ పోటీ చేసేసరికి దొరబాబును పక్కన పెట్టి వంగా గీతకు అవకాశం ఇచ్చారు.అయితే ఐదేళ్లు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉంటూ పార్టీ కోసం కష్టపడితే తనను పక్కన పెట్టడాన్ని దొరబాబు జీర్ణించుకోలేకపోయి ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో వైసీపీకి రాజీనామా చేశారు.

ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆళ్ళ నాని వైసీపీలో ప్రాథమిక సభ్యత్వానికి,వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.అలాగే వైసిపికి సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. టిడిపి నుంచి మోపిదేవి తాజా ఆఫర్ రావడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.మోపిదేవి లాంటి సీనియర్ నేత తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీకి ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి.అయితే ఫలితాలు వచ్చిన వెంటనే సీనియర్లు అజ్ఞాతంలోకి,జూనియర్లు అస్సలు మాట్లాడడం మానేశారు.ఆవిధంగా అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.కీలక నేతలు అంతా పార్టీకి, పదవులకు గుడ్ బై చెప్పి.. అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా మరో నాయకురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత.. వైసీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు.ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు గుడ్ బై చెబుతూ వస్తున్నారు.నిజానికి చాలా మంది నేతలు ఇదే ఆలోచనలో ఉన్నారని అందుకే పార్టీ తరపున మాటలు పూర్తిగా తగ్గించి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్సించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: