* మారని కేసిఆర్ తీరు..


* ఫామ్ హౌస్ కే పరిమితం..

* ప్రతిపక్ష హోదా అయిన మిగులుతుందా..

తెలంగాణ అనే పదం వినిపించింది అంటే చాలు మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కెసిఆర్ మాత్రమే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఆయనే. ఇక ఉద్యమాన్ని ముందుండి నడిపించింది కూడా ఆయనే. తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం ఒక్కతాటిపైకి తీసుకువచ్చి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సహకారం కావడానికి కూడా కారణం ఆయనే. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక రాష్ట్ర ప్రజలందరూ ఆయనను దేవుడిలా చూడటం మొదలుపెట్టారు. ఏకంగా రెండుసార్లు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు.


 కానీ ఆ తర్వాతే కేసీఆర్ సార్ తీరు తెలంగాణ ప్రజలకు నచ్చలేదు. ఇంకేముంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన మూడో అసెంబ్లీ ఎన్నికల్లో చివరికి టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. మూడోసారి భారీ మెజారిటీ సాధించి తెలంగాణలో హ్యాట్రిక్  కొట్టాలనుకున్న టిఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కేవలం 39 స్థానాల్లో మాత్రమే గెలిచిన టిఆర్ఎస్ పార్టీ.. చివరికి ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకుంది. కనుమరుగవుతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఘన విజయాన్ని అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 39 స్థానాలు చేతిలో ఉండడంతో బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కొనసాగుతుందని అనుకుంటున్న వేళ.. ఏకంగా 9 మంది టిఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.


 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎంతో మంది కీలక నేతలు పార్టీని వీడగా ఇక ఎన్నికల ఫలితాల తర్వాత మరికొంతమంది పార్టీ నుంచి జంప్ అయ్యారు. ఇలాంటి జంపింగ్ల నేపథ్యంలో కేసీఆర్ పార్టీలో ఉన్న మిగతా నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారని.. దూకుడైన శైలితో ప్రభుత్వ వైఫల్యాల పై విమర్శలు గుప్పిస్తూ.. నేనున్నాను అనే ఎవరు అధైర్య పడి ఆత్మవిశ్వాసాన్ని  కోల్పోకండి  అనే భరోసాను పార్టీని నమ్ముకుని ఇతర పార్టీలోకి వెళ్లకుండా ఉన్న నేతల్లో కలిగిస్తారని అందరూ అనుకుంటుండగా.. కెసిఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు.


 గతంలో ఇలా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేస్తే.. ఇక ఇప్పుడు కేసిఆర్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. రేవంత్ సర్కార్ ఎలాంటి పనులు చేస్తున్న.. అవి ఒక్క విషయంపై కూడా కేసీఆర్ నోరు మెదిపింది లేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించడం లేదు. ధైర్యం చెప్పి అండగా ఉండాల్సిన నాయకుడే ఫామ్ హౌస్ కి పరిమితమై సైలెంట్ అయిపోవడంతో మిగతా నేతలు అందరిలో కూడా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీంతో ఇంకొంతమంది అధికార కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కనీసం ప్రతిపక్ష హోదా అయిన అటు టిఆర్ఎస్ పార్టీకి మిగులుతుందా లేదా అన్నది అనుమానంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: