- కాంగ్రెస్ లోకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
- బీఆర్ఎస్ ఖాళీ అవ్వనుందా.?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం కేసీఆర్ ఎన్నో దీక్షలు పూనారు. రాష్ట్రాన్ని మొత్తం ఏకం చేసి చివరికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా ఆయన కృషి చేశారని చెప్పవచ్చు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ రెండుసార్లు సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఇంచుమించుగా 9 సంవత్సరాల పాలన చేశారు. ఈ విధంగా ఆయన పాలనలో ఎన్నో కొత్త పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని గొప్ప స్థాయిలోకి తీసుకెళ్లారని చెప్పవచ్చు .అలాంటి కేసీఆర్ చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వల్లే చివరికి మూడవ దఫా అధికారం కోల్పోయింది. దీనికి ప్రధాన కారణం ఆయనకు అతిగా పెరిగిన అహంకారం, కుటుంబ పాలన ఎక్కువ అవ్వడం, కింది స్థాయి నాయకులు అరాచకాలు చివరికి అధికారం కోల్పోయేలా చేశాయని చెప్పవచ్చు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ చుట్టూ అన్ని సుడిగుండాలే చుట్టుకుంటున్నాయి. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ కాలు విరిగిపోవడం, ఆ తర్వాత తన సొంత కూతురు కవిత అరెస్టు అవ్వడం జైలుకు వెళ్లడం. అంతేకాకుండా బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపు చూడడం, పార్లమెంట్ ఎలక్షన్స్ లో దారుణంగా ఓడిపోవడం. ఇలా ఒక్కొక్క దెబ్బ కేసీఆర్ గట్టిగా తగులుతున్నాయి. అలాంటి ఈ తరుణంలో రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ ఉంటుందా ఊడుతుందా అనే పరిస్థితి కూడా ఏర్పడింది.
కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్న బీఆర్ఎస్ నేతలు.!
మొత్తం బిఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కలిసి 32 మందికి పడిపోయారు . ఇక వీళ్లే కాకుండా పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడానికి సిద్ధమైపోయారు. ఇప్పటికే చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఈయనే కాకుండా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ ఇలా పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోవడంతో బీఆర్ఎస్ ఖాళీ అవుతూ వస్తోంది. వీళ్లే కాకుండా ఎన్నికలకు ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వంటి వారు కూడా చేరారు. అంతేకాకుండా కేసీఆర్ నమ్మిన బంటుగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కేశవరావు కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ విధంగా ఒక్కొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి జారుకోవడంతో కేసీఆర్ గుండెలు గుబిల్లుమంటున్నాయట. ఇలా ఎమ్మెల్యేని జంప్ అవుతున్న తరుణంలోనే పార్లమెంటు ఎలక్షన్స్ లో కూడా ఒక్క సీటు దక్కించుకోలేదు.