తెలుగు రాజకీయం.. ప్రతిపక్షం సంక్షోభం: వై నాట్ 175 అన్న జగన్ ఎందుకు సైలెంట్ అయ్యారు..?

•వై నాట్ 175 అన్న ధీమా ఇప్పుడు జగన్ లో కనిపించడం లేదేంటి..

•జగన్ చేసిన తప్పులే సంక్షోభంలో నెట్టేసాయా

•పార్టీ మారుతున్న నేతలు . జగన్ నిర్ణయం ఎటువైపు..

(ఆంధ్రప్రదేశ్- ఇండియా హెరాల్డ్ )

తెలుగు రాజకీయాలు ఎప్పటికప్పుడు మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే.  2019 ఎన్నికలలో ప్రజలలో సానుభూతి పొంది సంక్షేమ పథకాలను ఎరగా వేసి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత సంక్షేమ పథకాలను తాను చెప్పినట్టుగానే నూటికి 99% పూర్తి చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు .అయితే ఆయన కేవలం బడుగు బలహీన వర్గాలకు మాత్రమే మేలు చేశారు. మిగతా కులాలను పట్టించుకోలేదు. మిగతా కులాల వారిలో కూడా వెనుకబడిన వర్గాల వారు చాలామంది ఉన్నారు .కానీ వారందరినీ ఏ మాత్రం పట్టించుకో లేకపోవడం జగన్మోహన్ రెడ్డి చేసిన మొదటి తప్పు అంటూ చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దీనికి తోడు తనను అందలం ఎక్కించిన నాయకులను జగన్ పట్టించుకోలేదనే వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈసారి ఎన్నికలలో మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని,  వై నాట్ 175 అంటూ తెగ ప్రచారాలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే దాదాపు 175 స్థానాలలో పోటీ చేయించారు. అయితే ఈయన చేసిన తప్పేమిటంటే ఎవరికి ఏ నియోజకవర్గంలో పట్టు ఉందో వారికి కాకుండా ఇంకొకరిని తీసుకొచ్చి ఆ ప్రాంతాలలో పోటీ చేయించడమే జగన్ చేసిన మరో తప్పు.

తమ నియోజకవర్గాలలో సీటు వస్తుందని ఆశపడిన ఎంతోమంది నేతలకు నిరాశ మిగిలింది.అసలు అనుభవం లేని ప్రాంతాలలో పోటీ చేయడం వల్ల ప్రజలు వీరిని నమ్మకపోవడం వల్ల కూడా వీరికి ఓటు పడలేదనే వాదన వినిపిస్తూ ఉంటుంది. ఇలా చిన్నచిన్న తప్పులే ఆయన ఓటమికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఆ ఓటమి ఎంతలా ఉంది అంటే 2019 ఎన్నికలలో 175 స్థానాలలో పోటీ చేసి 151 స్థానాలను కైవసం చేసుకుంటే.. ఈసారి 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం అంటే కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకోవడం అంటే ఇంతకంటే ఘోరమైన పరాభవం మరి ఎక్కడ ఉండదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఈయనకు దక్కలేదు. నాడు వై నాట్ 175 అంటూ ప్రగల్బాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు నోరు మెదపడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి తోడు కనీసం 11 సీట్లు వచ్చినా ఆ 11 సీట్లు కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. చాలామంది నేతలు పార్టీలు మారుతున్నారు.  కనీసం ఇప్పటికైనా తాను చేసిన తప్పొప్పులను తెలుసుకొని ప్రజలనే కాదు పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను కూడా పట్టించుకొని ముందడుగు వేస్తే వచ్చే ఎన్నికలలో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి . మరి ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి విశ్లేషణ ఎలా ఉందో భవిష్యత్తులో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: